Share News

‘గ్యాస్‌’ కష్టం

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:45 AM

ఒకవైపు ఎండ. మరోవైపు చాంతాడంత క్యూ. ఇలా విజయపురంలో రోడ్డు పక్కన ఖాళీ గ్యాస్‌ సిలిండర్లతో నిరీక్షించారు వినియోగదారులు.

‘గ్యాస్‌’ కష్టం
గ్యాస్‌ సిలిండర్‌ కోసం ఎండలో బారులు తీరిన వినియోగదారులు

విజయపురం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ఒకవైపు ఎండ. మరోవైపు చాంతాడంత క్యూ. ఇలా విజయపురంలో రోడ్డు పక్కన ఖాళీ గ్యాస్‌ సిలిండర్లతో నిరీక్షించారు వినియోగదారులు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో మనకు గ్యాస్‌ కష్టాలు మొదలయ్యాయి. విజయపురంలో భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీ ఉంది. కాగా, మూడు రోజులుగా ఆటోలో సిలిండర్‌ తీసుకొని వెళ్లి వస్తున్నానని ఎల్లసముద్రానికి చెందిన వరలక్ష్మి తెలిపారు. ఒక సిలిండర్‌ కోసం ఎన్ని రోజులు తిరగాలో తెలియడం లేదన్నారు. అధికారులేమో గ్యాస్‌ కొరత లేదని చెబుతున్నారని, కానీ, ఇక్కడ డిమాండ్‌ ఎందుకు ఉందో తెలియడం లేదని ఎం.అగరానికి చెందిన బుజ్జి అడిగారు. గ్యాస్‌ సిలిండర్ల లోడ్‌ రోజు మార్చి రోజు వస్తోందని, సాధారణ పరిస్థితుల కంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా బుకింగ్‌ చేయడం వల్ల డిమాండ్‌ పెరుగుతున్నట్లు స్థానిక భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీ యజమాని ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. బుక్‌ చేసిన ప్రతి ఒక్కరికీ గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామన్నారు.

Updated Date - Mar 16 , 2026 | 12:45 AM