గంజాయి ముఠా గుట్టురట్టు
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:18 AM
విశాఖపట్నం నుంచి బెంగళూరుకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రాయచోటిలోని పాత ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ ధీరజ్ ఆ వివరాలను మీడియాకు వివరించారు.
ముగ్గురి అరెస్టు
4కిలోల గంజాయి, బైకు, మూడు సెల్‌ఫోన్ల స్వాధీనం
రాయచోటి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి బెంగళూరుకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రాయచోటిలోని పాత ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ ధీరజ్ ఆ వివరాలను మీడియాకు వివరించారు. రామాపురం మండల పరిధిలో గంజాయి సరఫరా చేస్తున్న బోడన్నా(వైజాగ్), ఖాదర్‌బాషా(రాయచోటి), పరిమల ప్రకా్‌ష(బిహార్)లను గువ్వలచెరువు ఘాట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 4 కిలోల గంజాయి, బైక్, 3సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో గంజాయిని కొనుగోలు చేసి బెంగళూరులో పోర్టల్ యాప్ ద్వారా విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. ఈ కేసును ఛేదించిన రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్.కృష్ణమోహన్, లక్కిరెడ్డిపల్లె సీఐ కృష్ణంరాజునాయక్, రాయచోటి రూరల్ సీఐ ఆర్‌కె.రోషన్, రామాపురం ఎస్‌ఐ కె.బి.శివకుమార్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.