ఆరెంజ్ జోన్‌లోనే గంగవరం
ABN , Publish Date - Apr 19 , 2026 | 01:51 AM
భానుడు భగభగమంటున్నాడు. శుక్రవారం అత్యధిక ఉష్ణోగ్రతతో ఆరెంజ్ జోన్‌లోకి వెళ్లిన చిత్తూరులో గంగవరం.. శనివారం కూడా అదే జోన్‌లో కొనసాగింది.
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): భానుడు భగభగమంటున్నాడు. శుక్రవారం అత్యధిక ఉష్ణోగ్రతతో ఆరెంజ్ జోన్‌లోకి వెళ్లిన గంగవరం.. శనివారం కూడా అదే జోన్‌లో కొనసాగింది. కాగా, శనివారం 40 డిగ్రీలకు మించి నాలుగు మండలాల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండలాల వారీగా.. గంగవరంలో 41.2, తవణంపల్లెలో 40.4, శాంతిపురంలో 40.1, రొంపిచెర్లలో 40.0, శ్రీరంగరాజపురంలో 39.8, బంగారుపాళ్యంలో 39.4, నిండ్రలో 39.0, నగరిలో 38.8, పెద్దపంజాణి, పులిచెర్ల, వెదురుకుప్పంలో 38.6, చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, యాదమరి, గంగాధరనెల్లూరు, పెనుమూరు, పాలసముద్రం, ఐరాల, పూతలపట్టు, కార్వేటినగరంలో 38.4, విజయపురంలో 37.9, పలమనేరులో 37.8, కుప్పం, రామకుప్పంలో 36.9, వి.కోట, బైరెడ్డిపల్లె, గుడుపల్లెలో 36.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.