కొబ్బరిచిప్పలో గంగమ్మ
ABN , Publish Date - May 07 , 2026 | 01:28 AM
పచ్చి కొబ్బరిచిప్పలో చిత్రించిన గంగమ్మ ప్రతిరూపం భక్తులను ఆకర్షిస్తోంది. కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర 13వ తేది నుంచి ప్రారంభం కానుంది.
పచ్చి కొబ్బరిచిప్పలో చిత్రించిన గంగమ్మ ప్రతిరూపం భక్తులను ఆకర్షిస్తోంది. కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర 13వ తేది నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర కళాకారుడు పురుషోత్తం (పూరి ఆర్ట్స్) పచ్చి కొబ్బరిచిప్పలో గంగమ్మ విశ్వరూపాన్ని చిత్రీకరించారు. శిరస్సుపై నాగపడిగలతో కూడిన బంగారు కిరీటం, చెవులకు పెద్దపెద్ద రింగులు, నుదుట విభూదిరేఖలు, కుంకుమ, పెద్ద కళ్లు, నాసికకు ముక్కెర, నోట్లోనుంచి పొడుచుకు వచ్చిన కోరలు, మెడలో పూలమాల.. ఇలా అమ్మవారి సంపూర్ణ విశ్వరూప దర్శనం చిత్రించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
- కుప్పం, ఆంధ్రజ్యోతి