Share News

సర్‌ పరిశీలకుడిగా గంధం చంద్రుడు

ABN , Publish Date - Jun 21 , 2026 | 01:29 AM

జిల్లాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) కార్యక్రమ పరిశీలకుడిగా కార్మికశాఖ కమిషనర్‌ గంధం చంద్రుడు నియమితులయ్యారు.

సర్‌ పరిశీలకుడిగా గంధం చంద్రుడు

13,05,175ఎన్యుమరేషన్ల ఫారాల పంపిణీ

తిరుపతి(కలెక్టరేట్‌), జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) కార్యక్రమ పరిశీలకుడిగా కార్మికశాఖ కమిషనర్‌ గంధం చంద్రుడు నియమితులయ్యారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించడంతో పాటు ఎన్నికల సంఘానికి మూడు విడతల్లో నివేదికలు అందజేస్తారు.సర్‌ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు ఇంటింటా పరిశీలన చేపడుతున్నారు.శనివారం నాటికి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 73.76శాతం ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తయింది.పంపిణీ చేసిన గణన ఫారాల్లో ఇప్పటి వరకు 13,05,175 ఫారాలను ఓటర్లకు అందజేశారు.

Updated Date - Jun 21 , 2026 | 01:29 AM