Share News

సూర్యప్రభపై గజముఖుడు

ABN , Publish Date - Sep 28 , 2026 | 01:23 AM

కాణిపాక ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా ఆదివారం వినాయకస్వామి సూర్యప్రభ వాహనంపై విహరించారు.

సూర్యప్రభపై గజముఖుడు

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): కాణిపాక ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా ఆదివారం వినాయకస్వామి సూర్యప్రభ వాహనంపై విహరించారు. ఈ కార్యక్రమానికి రాజమ్మ, రాజశేఖర్‌నాయుడు జ్ఞాపకార్థం కుమారులు ఇంద్రసేనానాయుడు, లక్ష్మీపతినాయడు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామివారికి ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం చేశారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరస తీసుకురావడంతో ఆలయ కల్యాణ వేదిక వద్ద సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవర్లకు విశేష పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను సూర్యప్రభ వాహనంపై అధిష్ఠింపచేసి పురవీధులలో ఊరేగించారు. ఆలయ ఆస్థాన మండపంలోని సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌, ఏఈవోలు రవీంద్రబాబు, ధనపాల్‌, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, రవి, ఉభయదారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 01:23 AM