విద్యుత్ షాక్‌తో గజరాజు మృతి
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:13 AM
విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి చెందిన సంఘటన పెద్దపంజాణి మండలంలో చోటు చేసుకుంది. అటవీశాఖ అధికారుల కథనం మేరకు.....గంగవరం మండలం కల్లుపల్లెకు చెందిన ఈశ్వరయ్యకు పెద్దపంజాణి మండల పరిధిలోని అటవీప్రాంతంలో మామిడి తోట వుంది. అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్ లైన్లను కంచె వెంబడి ఎవరో ఏర్పాటు చేశారు.
పెద్దపంజాణి, జనవరి 19(ఆంధ్రజ్యోతి):విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి చెందిన సంఘటన పెద్దపంజాణి మండలంలో చోటు చేసుకుంది. అటవీశాఖ అధికారుల కథనం మేరకు.....గంగవరం మండలం కల్లుపల్లెకు చెందిన ఈశ్వరయ్యకు పెద్దపంజాణి మండల పరిధిలోని అటవీప్రాంతంలో మామిడి తోట వుంది. అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్ లైన్లను కంచె వెంబడి ఎవరో ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి దాదాపు 25 సంవత్సరాల వయసున్న మగఏనుగు తోటలోకి వెళ్లబోయి విద్యుత్ షాక్‌కు గురైంది.తొండానికి విద్యుత్‌లైన్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మంగళవారం ఉదయం తోట యజమాని ఏనుగు మృతిచెంది ఉండడాన్ని గమనించి అధికారులకు సమాచారం అందించారు.డీఎ్‌ఫవో సుబ్బరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఏనుగు మృతిపై స్థానికులను అడిగి తెలుకున్నారు. సబ్ డీఎ్‌ఫవో వేణుగోపాల్, ఎఫ్‌ఆర్వో నారాయణ, ఎఫ్‌బీవోలు పరమేశ్వర్, హైమావతి, ఎఫ్‌ఎ్‌సవోలు సుకుమార్, రమణారెడ్డి, తహసీల్దార్ హనుమంతు,ఎ్‌సఐ మారెప్ప, సర్పంచ్ రమే్‌షబాబు, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.