రాయలచెరువు బాధిత రైతులకు నిధులొచ్చాయ్
ABN , Publish Date - Jun 28 , 2026 | 01:07 AM
కేవీబీపురం మండలంలో గత యేడాది నవంబరు 6న రాయలచెరువు తెగి పొలాలు,ఇళ్లు దెబ్బతిన్న వారికి పరిహార నిధులు విడుదలయ్యాయి.
కేవీబీపురం, జూన్ 27(ఆంధ్రజ్యోతి):కేవీబీపురం మండలంలో గత యేడాది నవంబరు 6న రాయలచెరువు తెగి పొలాలు,ఇళ్లు దెబ్బతిన్న వారికి పరిహార నిధులు విడుదలయ్యాయి.అప్పట్లో చెరువు వున్నట్లుండి తెగడంతో 1,180 ఎకరాల పొలాలు దెబ్బతిని 770మంది రైతులు నష్టపోయారని వ్యవసాయాఽధికారులు లెక్కగట్టారు. దెబ్బతిన్న పొలాలకు సంబంధించి హెక్టార్‌కు రూ.18వేల చొప్పున నష్టపరిహారం అందనుంది.నష్టపోయిన రైతులకు రూ.1,09,12,650 చెల్లించాలన్న ప్రభుత్వాదేశాలతో కలెక్టర్ నిధులు విడుదల చేశారు. అయితే గతంలో పశువులు, ఇళ్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వం ఇచ్చిన ఆర్ధిక సాయంలో అనర్హులు ఎక్కువ లబ్ధి పొందారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గతంలో లాగా కాకుండా పొలాలు,ఇండ్లు దెబ్బతిని నష్టపోయిన వారికే ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పంపిణీచేయాలని కోరుతున్నారు.