Share News

రెండు రైల్వే లైన్లకు నిధులు మంజూరు

ABN , Publish Date - Apr 04 , 2026 | 01:59 AM

దక్షిణ రైల్వే జోన్‌ పరిధిలోని నగరి నియోజక వర్గంలో రెండు రైల్వే లైన్ల ప్రాజెక్టులకు నిధులు మంజూరయ్యాయి. ఇందులో 88.30 కిలోమీటర్ల పుత్తూరు-అత్తిపట్టు ప్రాజెక్టు కోసం 517.37 కోట్లను కేటాయించారు.ఈ నిధులతో సర్వే పనులతో పాటు భూసేకరణ కూడా పూర్తి చేయనున్నారని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో నారాయణవనం, పిచ్చాటూరు, నాగలాపురం, తమిళనాడులోని ఊతుకోట, పాలవాక్కం, పెరియపాలెం, గంగయాదికుప్పంలో స్టేషన్లను ప్రతిపాదించారు. ఈ రైల్వే మార్గంలో 15 మేజర్‌, 159 మైనర్‌ వంతెనలు నిర్మించాల్సి వుంది.

రెండు రైల్వే లైన్లకు నిధులు మంజూరు

  • పుత్తూరు-అత్తిపట్టు , నగరి-దిండివనం ప్రాజెక్టుల పనులకు రూ.1095 కోట్లు కేటాయింపు

పుత్తూరు,ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): దక్షిణ రైల్వే జోన్‌ పరిధిలోని నగరి నియోజక వర్గంలో రెండు రైల్వే లైన్ల ప్రాజెక్టులకు నిధులు మంజూరయ్యాయి. ఇందులో 88.30 కిలోమీటర్ల పుత్తూరు-అత్తిపట్టు ప్రాజెక్టు కోసం 517.37 కోట్లను కేటాయించారు.ఈ నిధులతో సర్వే పనులతో పాటు భూసేకరణ కూడా పూర్తి చేయనున్నారని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో నారాయణవనం, పిచ్చాటూరు, నాగలాపురం, తమిళనాడులోని ఊతుకోట, పాలవాక్కం, పెరియపాలెం, గంగయాదికుప్పంలో స్టేషన్లను ప్రతిపాదించారు. ఈ రైల్వే మార్గంలో 15 మేజర్‌, 159 మైనర్‌ వంతెనలు నిర్మించాల్సి వుంది. పుత్తూరు స్టేషన్‌ నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో అంటే నారాయణవనం రైల్వే గేటు, మరాఠీ గేటు మధ్య ఈ లైను తూర్పు దిశగా పోతుంది. ఈ ప్రాజెక్టు వల్ల తూర్పు ప్రాంతంలో ఇప్పటి వరకు వినపడని రైల్వే కూతను ఈ ప్రాంతప్రజలు వినే అవకాశం వుంది. దక్షిణ రైల్వే అధికారులు మాత్రం చెన్నై హార్బర్‌కు బొగ్గు, ఇనుము రవాణా వత్తిడి ఎక్కువగా వుండడంతో అత్తిపట్టు సమీపంలోని ఎన్నూరు ఓడరేవుకు మళ్లించాలని భావిస్తున్నారు. అలాగే నగరి నుంచి వేలూరు మీదుగా దిండివనం ప్రాజెక్టుకు కూడా 578.40 కోట్లను మంజూరు చేశారు. ఈ రైల్వే లైన్‌కు భూసేకరణ, సర్వే పనుల కోసం ఈ నిధులను వెచ్చించాల్సి వుంది. దాదాపు 179.2 కిలో మీటర్లున్న ఈ ప్రాజెక్టు పనులు ఎక్కువగా తమిళనాడు ప్రాంతంలో జరగాల్సి వుంది. ఈ రెండు కొత్త ప్రాజెక్టులు పూర్తయితే పుత్తూరు మరో రైల్వే జంక్షనుగా మారనుంది.

===============================

Updated Date - Apr 04 , 2026 | 01:59 AM