వైభవంగా పౌర్ణమి గరుడసేవ
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:13 AM
తిరుమలలో ఆదివారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.
తిరుమలలో ఆదివారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతి పౌర్ణమికి ఈ సేవను నిర్వహించడం టీటీడీకి ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా రాత్రి మలయప్పస్వామి విశేష అలంకరణలో తన ఇష్టవాహనమైన గరుడుడిపై కొలువుదీరి ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి.. భక్తులకు దర్శనమిచ్చారు. చల్లటి వాతావరణంలో మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల కర్పూర హారతులు, గోవింద నామస్మరణల మధ్య గరుడవాహనసేవ కన్నులపండువగా జరిగింది.
- తిరుమల, ఆంధ్రజ్యోతి