Share News

నెరవేరిన సీఎం హామీ

ABN , Publish Date - May 22 , 2026 | 01:50 AM

ఓ పేదవాడికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని జిల్లా అధికారులు గురువారం నెరవేర్చారు. కలెక్టరేట్‌ వేదికగా మెప్మా ఆధ్వర్యంలో ఈ-ఆటోను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అందజేశారు.

నెరవేరిన సీఎం హామీ
సురేంద్రకు ఆటో తాళాలందజేస్తున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

నాయుడుపేటవాసికి ఈ-ఆటో అందజేత

తిరుపతి(కలెక్టరేట్‌)/నాయుడుపేట, మే 21 (ఆంధ్రజ్యోతి): ఓ పేదవాడికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని జిల్లా అధికారులు గురువారం నెరవేర్చారు. కలెక్టరేట్‌ వేదికగా మెప్మా ఆధ్వర్యంలో ఈ-ఆటోను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అందజేశారు. ఈ ఏడాది మార్చి 30వ తేదీన నాయుడుపేటలో టిడ్కో గృహ ప్రవేశ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు.సీ4-జీ6 ప్లాట్‌ గృహ ప్రవేశంలో లబ్ధిదారుడు ముక్కర సురేంద్ర జీవనోపాధి కోసం సీఎం చంద్రబాబును ఈ-ఆటో కోసం అభ్యర్థించాడు.సీఎం స్పందించి కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు.ఈ నేపథ్యంలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ గురువారం సురేంద్రను కలెక్టరేట్‌కు రప్పించి రూ.3.52 లక్షల విలువ గల ఈ-ఆటోను అందజేశారు. ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, మెప్మా పీడీ ఇఫ్రాయిమ్‌, నాయుడుపేట మున్సిపల్‌ కమిషనర్‌ ఫజులుల్లా, జయరామ్‌ తదితరులు పాల్గొన్నారు. అద్దె ఆటోతో కిరాయి, ఇంటి అద్దె కట్టుకుంటూ కుటుంబపోషణకు సతమతమవుతున్న తనకు టిడ్కో గృహాల్లో సీ4-జీ6 ఇల్లు ఇవ్వడంతో పా జీవనోపాధి కోసం ఈ-ఆటోను ఇప్పించిన సీఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యే విజయశ్రీకి , కలెక్టర్‌ వెంకటేశ్వర్‌కు సురేంద్ర కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - May 22 , 2026 | 01:50 AM