Share News

వైసీపీ నుంచి టీడీపీలోకి..

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:49 AM

లక్కిరెడ్డిపల్లెకు చెందిన వైసీపీ నేత, మాజీ ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు కలిసి సుమారు 200 కుటుంబాలు శనివారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి..
సుదర్శన్‌రెడ్డికి కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

మంత్రి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న 200 కుటుంబాలు

ఇందులో మాజీ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి

లక్కిరెడ్డిపల్లె, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : లక్కిరెడ్డిపల్లెకు చెందిన వైసీపీ నేత, మాజీ ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు కలిసి సుమారు 200 కుటుంబాలు శనివారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. సుదర్శన్‌రెడ్డి స్వగృహంలో వారు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో 90శాతం విజయాలు సాధించామన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. ఇవన్నీ చూసే ఇతర పార్టీల నుంచి నాయకులు తమ పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీలో ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందన్నారు. 2004 నుంచి సుదర్శన్‌రెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వ్యక్తి తమ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని కొనియాడారు. స్థానిక ఎన్నికల్లో మండలంలోని 16 పంచాయతీల్లో టీడీపీ జెండా ఎగురవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి మున్సిపల్‌ చైర్మన్‌గా ఏకగ్రీవమైన ఖాదర్‌వల్లి, జడ్పీటీసీగా ఎన్నికైన మదనమోహన్‌, రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్‌ రెడ్డి యాదవ్‌, మాజీ ఎంపీపీ రెడ్డెయ్య, క్లస్టర్‌ ఇన్‌చార్జి జయరాం, టీడీపీ మైనార్టీ సెల్‌ నియోజకవర్గ జనరల్‌ సెక్రటరీ ఆరీఫ్‌, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ షఫీనాయక్‌, టీడీపీ సీనియర్‌ నేతలు పాపయ్య, వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 12:49 AM