రైలు కిందపడి స్నేహితుల ఆత్మహత్య
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:51 AM
తడ మండల పరిధిలోని కొండూరు రైల్వేగేటు వద్ద ఆదివారం రాత్రి ఇద్దరూ స్నేహితులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.
తడ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):తడ మండల పరిధిలోని కొండూరు రైల్వేగేటు వద్ద ఆదివారం రాత్రి ఇద్దరూ స్నేహితులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.సూళ్లూరుపేట మండలం పిండిపాలేనికి చెందిన డమాయి కల్యాణ్ (24), బేరిపట్రంగానికి చెందిన జడా సునీల్ కుమార్ (23) ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి మోటారు సైకిల్‌లో తడ మండలం కొండూరు రైల్వేగేటు వద్దనున్న బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. అక్కడ మోటారు సైకిల్‌ను నిలిపి ఇద్దరూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. కల్యాణ్‌కు రెండు నెలల క్రితమే వివాహమైంది. మృతదేహాలను సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.