Share News

‘పుర’ ఎన్నికల్లో నామినేషన్ల జోరు

ABN , Publish Date - Oct 18 , 2026 | 01:40 AM

‘పుర’ ఎన్నికల్లో

 ‘పుర’ ఎన్నికల్లో నామినేషన్ల జోరు
చిత్తూరు మేయర్‌ టీడీపీ అభ్యర్థిగా శనివారం ఎన్నికల అధికారికి నామినేషన్‌ పత్రాన్ని అందజేస్తున్న కఠారి హేమలత

చైర్మన్లకు 24.. వార్డులకు 527

‘పుర’ ఎన్నికల్లో నామినేషన్ల జోరు

నేటితో ముగియనున్న గడువు

చిత్తూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలమనేరు, నగరి, కుప్పం మున్సిపాలిటీల్లో రెండో రోజు శనివారం నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. వార్డు సభ్యుల స్థానాలతో పాటు చైర్‌పర్సన్‌ స్థానాలకూ ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం నాటికి నాలుగు మున్సిపాలిటీల్లో వార్డు స్థానాలకు 527.. చైర్‌పర్సన్‌ స్థానాలకు 24 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యులకు వచ్చిన నామినేషన్లలో టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఇప్పటివరకు టీడీపీ తరపున 236 నామినేషన్లు వస్తే, వైసీపీ నుంచి 223 దాఖలు చేశారు. జనసేన నుంచి 26, బీజేపీ తరఫున 10 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఇతర పార్టీల నుంచి మూడు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 29 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం ఒక్కరోజే వార్డు సభ్యుల స్థానాలకు 498 నామినేషన్లు అందాయి. నామినేషన్ల స్వీకరణకు ఆదివారం చివరి రోజు కావడంతో మిగిలిన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. శనివారం రాత్రి పలమనేరు చైర్‌పర్సన్‌ టీడీపీ అభ్యర్థిగా రాజ్యలక్ష్మిని అధిష్ఠానం ప్రకటించింది. రెండు పార్టీల నుంచీ వార్డు సభ్యుల అభ్యర్థిత్వాలను అధికారికంగా ప్రకటించకపోయినా.. ఆశావహులంతా నామినేషన్లు వేశారు.

చిత్తూరు కార్పొరేషన్‌లో అత్యధికం

మున్సిపాలిటీల వారీగా చూసుకుంటే చిత్తూరు కార్పొరేషన్‌లోని 60 డివిజన్లకు గానూ 216 నామినేషన్లు నమోదయ్యాయి. ఇందులో టీడీపీ నుంచి 75, వైసీపీ నుంచి 93, జనసేన నుంచి 18, బీజేపీ నుంచి 9, ఇతరుల నుంచి 2, స్వతంత్రుల నుంచి 19 వచ్చాయి.

కుప్పం మున్సిపాలిటీలోని 32 వార్డులకు 134 నామినేషన్లు నమోదయ్యాయి. టీడీపీ నుంచి 72, వైసీపీ నుంచి 53, జనసేన నుంచి 4, స్వతంత్రుల నుంచి 5 నామినేషన్లున్నాయి.

నగరిలోని 40 వార్డులకుగానూ 112 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నుంచి 50, వైసీపీ నుంచి 57, జనసేన నుంచి 2, స్వతంత్రుల నుంచి 3 నామినేషన్లున్నాయి.

పలమనేరులోని 36 వార్డులకు 65 నామినేషన్లు నమోదయ్యాయి. వీటిలో టీడీపీ నుంచి 39, వైసీపీ నుంచి 20, జనసేన తరపున 2, బీజేపీ నుంచి ఒకటి, ఇతరులు ఒకటి, స్వతంత్రులు 2 నామినేషన్లు దాఖలు చేశారు.

నాలుగు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానాలకుగాను రెండు రోజుల్లో 24 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీల వారీగా చూసుకుంటే వైసీపీకి 11, టీడీపీకి 10, కాంగ్రె్‌సకు 1, స్వతంత్రుల నుంచి 2 ఉన్నాయి. చిత్తూరు మేయర్‌ స్థానానికి 8, కుప్పం, నగరి మున్సిపాలిటీల్లో 7 చొప్పున, పలమనేరులో 2 నామినేషన్లు దాఖలయ్యాయి.

Updated Date - Oct 18 , 2026 | 01:40 AM