నాలుగు కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:45 AM
మదనపల్లె పరిసర ప్రాంతాల్లో గంజాయి ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. శనివారం నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
- నలుగురి అరెస్టు
మదనపల్లె అర్బన్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి) : మదనపల్లె పరిసర ప్రాంతాల్లో గంజాయి ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. శనివారం నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్సీ వెంకటాద్రి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షణలో మదనపల్లె సీఐ కళా వెంకటరమణ తన సిబ్బందితో కలిసి శనివారం ఉదయం బసినికొండ పంచాయతీ కనుమలో గంగమ్మ ఆలయ సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. పుంగనూరు వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులో వచ్చిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వారు సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన మల్లెల మహేష్, మల్లెల అమరావతి, పుంగనూరు పట్టణానికి చెందిన మల్లెల రాజమ్మ, మల్లెల చంటిగా గుర్తించారు. గతంలో వీరిపై పలు పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయి. నిందితులను పట్టుకున్న సీఐ కళా వెంకటరమణ, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.