Share News

డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ సహదేవరెడ్డి అరెస్టు

ABN , Publish Date - Oct 30 , 2026 | 01:13 AM

పుంగనూరు మున్సిపల్‌ నామినేషన్‌ కేంద్రం వద్ద ఈనెల 16న ఎంపీ మిథున్‌రెడ్డితోపాటు అల్లర్లలో పాల్గొన్న చిత్తూరు జిల్లా కోఅపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ మాజీ చైర్మన్‌ సహదేవరెడ్డిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు.

డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ సహదేవరెడ్డి అరెస్టు

పుంగనూరు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): పుంగనూరు మున్సిపల్‌ నామినేషన్‌ కేంద్రం వద్ద ఈనెల 16న ఎంపీ మిథున్‌రెడ్డితోపాటు అల్లర్లలో పాల్గొన్న చిత్తూరు జిల్లా కోఅపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ మాజీ చైర్మన్‌ సహదేవరెడ్డిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. చిన్నగొట్టిగల్లు సింగల్‌విండో మాజీ అధ్యక్షుడు, వైపీసీ నాయకుడు సహదేవరెడ్డి, యుగంధర్‌రెడ్డి మున్సిపల్‌ నామినేషన్ల సందర్భంగా ఎంపీతోపాటు కేంద్రం వద్దకు కాన్వాయ్‌లో వచ్చి గొడవలకు పాల్పడి దాడులు చేసినట్లు పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరిని అరెస్టు చేసి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టులో హాజరుపరచగా జడ్జి పరేశ్‌కుమార్‌ వారికి 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు.

Updated Date - Oct 30 , 2026 | 01:13 AM