తొలి విడతకు రేపే పల్లె పోరు
ABN , Publish Date - Nov 25 , 2026 | 01:54 AM
జిల్లాలో తొలివిడత కింద కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో గురువారం పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 9 మండలాల పరిధిలోని 182 పంచాయతీలు, 1908 వార్డు స్థానాల్లో ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్‌కుమార్ నోటిఫికేషను జారీ చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఐదు సర్పంచి, 712 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 177 సర్పంచి స్థానాలకు 494 మంది, 1196 వార్డు స్థానాలకు 2482 మంది పోటీలో మిగిలారు. ఈ పంచాయతీల్లో గురువారం (26వ తేదీ) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, 2 గంటల నుంచి కౌంటింగ్, తదుపరి ఫలితాల వెల్లడి వెనువెంటనే జరిపి విజేతల వివరాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచి ఎన్నికలు జరుగుతాయి. అనివార్య కారణాలతో ఎక్కడైనా ఎన్నికలు వాయిదా పడితే శుక్రవారం నిర్వహిస్తారు.
177 సర్పంచి స్థానాలకు 494.. 1196 వార్డు స్థానాలకు 2482 మంది పోటీ
పోలింగ్.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు
ఐదుగురు సర్పంచులు, 712 వార్డులు ఏకగ్రీవం
చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలివిడత కింద కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో గురువారం పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 9 మండలాల పరిధిలోని 182 పంచాయతీలు, 1908 వార్డు స్థానాల్లో ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్‌కుమార్ నోటిఫికేషను జారీ చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఐదు సర్పంచి, 712 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 177 సర్పంచి స్థానాలకు 494 మంది, 1196 వార్డు స్థానాలకు 2482 మంది పోటీలో మిగిలారు. ఈ పంచాయతీల్లో గురువారం (26వ తేదీ) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, 2 గంటల నుంచి కౌంటింగ్, తదుపరి ఫలితాల వెల్లడి వెనువెంటనే జరిపి విజేతల వివరాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచి ఎన్నికలు జరుగుతాయి. అనివార్య కారణాలతో ఎక్కడైనా ఎన్నికలు వాయిదా పడితే శుక్రవారం నిర్వహిస్తారు.
నేడు ఎన్నికల సామగ్రి తరలింపు
తొలి విడత ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముందస్తు ఏర్పాట్లు జరిగాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లుగా గుర్తించిన ఎంపీడీవో కార్యాలయం, జడ్పీ ఉన్నత పాఠశాలల నుంచి ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభమవుతుంది. ఎన్నికల సిబ్బందికి అవసరమైన బ్యాలెట్ పెట్టెలు, సర్పంచ్, వార్డు స్థానాలకు వేర్వేరు రంగుల్లో గుర్తులు కలిపి ముద్రించిన బ్యాలెట్ పేపర్లు, ఇతర ఎన్నికల సామగ్రిని పోలింగ్ అధికారులకు అందజేస్తారు. ఇందుకోసం రూట్స్, జోన్స్ గుర్తించారు. సర్పంచ్ స్థానానికి పింక్ రంగు బ్యాలెట్ పేపర్లో 25 గుర్తులు, వార్డు స్థానాలకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లో 20 గుర్తులు ( పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి) ముద్రించారు. 1581 పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వెబ్ చిత్రీకరణ చేపడతారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణ కోసం 1700 మంది పీవో, ఏపీవో, వోపీవోలను కలెక్టర్ సుమిత్‌కుమార్ నియమించారు. స్టేజ్-2 ఆఫీసర్ పర్యవేక్షణలో పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏకగ్రీవ సర్పంచులు, ఉపసర్పంచులు వీరే
జిల్లాలో తొలి విడతలో ఐదు పంచాయతీలు వార్డులతో సహా ఏకగ్రీవమయ్యాయి. సర్పంచి, ఉపసర్పంచుల ఎన్నికా ఏకగ్రీవమైనట్లు డీపీవో సుధాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. కుప్పం మండలం నాయనూరు పంచాయతీలో సర్పంచిగా శాలిని, ఉపరస్పంచిగా ఎం.సంపత్.. దేవరాజపురంలో గోవిందమ్మ, అన్నదురై.. బ్రహ్మదేవరచేనులో పిచ్చమ్మ, మాలతి.. పెద్దపంజాణి మండలం వీరపల్లిలో ఎ.సుబ్రహ్మణ్యం, కె.గోవిందప్ప.. గంగవరం మండలం చౌడిరెడ్డిపల్లెలో సి.జయలక్ష్మి, బి.నాగరాజు రెడ్డి ఎన్నికైనట్లు తెలిపారు.