Share News

శ్రీవారి సర్వదర్శన భక్తుల కోసం..

ABN , Publish Date - Aug 10 , 2026 | 02:03 AM

తిరుమల శ్రీవారి సర్వదర్శన భక్తుల సౌకర్యార్థం రింగురోడ్డులో శాశ్వత క్యూలైన్లు, వంతెనల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

శ్రీవారి సర్వదర్శన భక్తుల కోసం..
శిలాతోరణం సర్కిల్‌ వద్ద వంతెన నిర్మాణ పనులు

తిరుమల, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి సర్వదర్శన భక్తుల సౌకర్యార్థం రింగురోడ్డులో శాశ్వత క్యూలైన్లు, వంతెనల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని షెడ్లు నిండిపోయాక సర్వదర్శన క్యూలైన్‌ కృష్ణతేజ సర్కిల్‌ మీదుగా రింగురోడ్డులో శిలాతోరణం, బాటగంగమ్మ, శ్రీవారిసేవా సదన్‌, గోగర్భం డ్యాం సర్కిల్‌ వరకు వ్యాపిస్తోంది. దీంతో బాటగంగమ్మ ఆలయ సర్కిల్‌ నుంచి గోగర్భం సర్కిల్‌ వరకు శాశ్వత క్యూలైన్‌తో పాటు శిలాతోరణం సర్కిల్‌, బాటగంగమ్మ, శ్రీవారి సేవాసదన్‌ సర్కిల్‌లో స్టీల్‌ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం జూన్‌లో దాదాపు రూ.12 కోట్లతో టెండర్లు కూడా ఖరారు చేసింది. ప్రస్తుతం శాశ్వత క్యూలైన్‌, బ్రిడ్జిల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే నందకం వద్ద కూడా వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి.

Updated Date - Aug 10 , 2026 | 02:04 AM