Share News

ఎన్నాళ్లకెన్నాళ్లకు...!

ABN , Publish Date - May 15 , 2026 | 12:57 AM

విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బ్యాక్‌లాగ్‌, రెగ్యులర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు 15వ తేదీ నోటిఫికేషన్‌ వెలువరించనుంది.

ఎన్నాళ్లకెన్నాళ్లకు...!

విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్‌

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 14 (ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బ్యాక్‌లాగ్‌, రెగ్యులర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు 15వ తేదీ నోటిఫికేషన్‌ వెలువరించనుంది.దీంతో ఎస్వీ, మహిళా, ద్రవిడ వర్సిటీల్లో 14 ప్రొఫెసర్‌, 62 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ,117 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ కానున్నాయి.బ్యాక్‌లాగ్‌ పోస్టుల్లో 23 అసోసియేట్‌ ప్రొఫెసర్‌, 3 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీ వున్నాయి.ఫఎస్వీయూలో రెగ్యులర్‌ ప్రొఫెసర్‌-3, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-34, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ - 88, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ - 13 , అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-2ఖాళీలున్నాయి.ఫపద్మావతి వర్సిటీలో ప్రొఫెసర్‌ - 6, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ - 20, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ - 22, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ - 5, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ - 1ఖాళీలున్నాయి.ఫ ద్రవిడ వర్సిటీలో ప్రొఫెసర్‌-5, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-8, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-7, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ - 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ కానుంది.

Updated Date - May 15 , 2026 | 12:57 AM