వికృతమాల పరిశ్రమలో ఫుడ్ పాయిజన్
ABN , Publish Date - Apr 30 , 2026 | 02:02 AM
ఏర్పేడు మండలం వికృతమాల వద్ద ఉన్న ఓ పరిశ్రమలో పనిచేస్తున్న 90మంది కార్మికులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థత పాలయ్యారు.విశ్వసనీయ సమాచారం మేరకు...
90మందికి స్వల్ప అస్వస్థత
ఏర్పేడు, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): ఏర్పేడు మండలం వికృతమాల వద్ద ఉన్న ఓ పరిశ్రమలో పనిచేస్తున్న 90మంది కార్మికులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థత పాలయ్యారు.విశ్వసనీయ సమాచారం మేరకు... రోజువారీ విధుల్లో భాగంగా మంగళవారం విదులకు వెళ్లిన వారు మధ్యాహ్నం క్యాంటీన్‌లో భోం చేశారు.తల తిరిగి వాంతులు కావడంతో గుర్తించిన యాజమాన్యం వారిని తిరుపతి రుయాస్పత్రికి తరలించగా చికిత్సతో కుదుటపడ్డారు.అయితే దీనిపై ఏర్పేడు పోలీసులను వివరణ కోరగా నలుగురు కార్మికులు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని వారు కూడా ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడి ఇళ్లకు వెళ్లినట్లు తెలిపారు.