Share News

రేషన్‌ దుకాణాలపై ఫిర్యాదుల వెల్లువ

ABN , Publish Date - Jul 10 , 2026 | 01:29 AM

రేషన్‌ దుకాణాల్లో జరుగుతున్న అవకతవకలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయప్రతా్‌పరెడ్డి తెలిపారు. రైల్వేకోడూరులో గురువారం అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్‌దుకాణాలతోపాటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పంపిణీ తదితరాలను ఆయన తనిఖీ చేశారు. లొకేషన్‌ పెట్టుకుని రైల్వేకోడూరులోని ఓ ప్రాంతానికి వెళ్లి రేషన్‌ పంపిణీని పరిశీలించి, సంతృప్తి చెందారు.

రేషన్‌ దుకాణాలపై ఫిర్యాదుల వెల్లువ
రైల్వేకోడూరులో రేషన్‌ పంపిణీ ఎలా ఉందని మహిళలను అడిగి తెలుసుకుంటున్న విజయప్రతా్‌పరెడ్డి

- రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయప్రతా్‌పరెడ్డి

రైల్వేకోడూరు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ దుకాణాల్లో జరుగుతున్న అవకతవకలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయప్రతా్‌పరెడ్డి తెలిపారు. రైల్వేకోడూరులో గురువారం అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్‌దుకాణాలతోపాటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పంపిణీ తదితరాలను ఆయన తనిఖీ చేశారు. లొకేషన్‌ పెట్టుకుని రైల్వేకోడూరులోని ఓ ప్రాంతానికి వెళ్లి రేషన్‌ పంపిణీని పరిశీలించి, సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. సాధారణ తనిఖీల్లో భాగంగా రైల్వేకోడూరులోని రేషన్‌దుకాణాలను పరిశీలించామని తెలిపారు. రాష్ట్రంలోని చాలాచోట్ల చక్కెర అర కిలో రూ.17 ఉండగా రూ.20కి విక్రయాలు చేస్తున్నారన్న ఫిర్యాదు వచ్చాయని చెప్పారు. ఇక అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం హమాలీల సమస్యలపై చైర్మన్‌కు రేషన్‌ డీలర్లు విన్నవించారు. స్థానిక అధికారులతో చర్చించి పరిష్కారం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సివిల్‌ సప్లయీస్‌ డీటీ జయరాజు, అసిస్టెంట్‌ మేనేజర్‌ రమేష్‌, ఎన్‌ఫోర్సుమెంట్‌ డీటీ శ్రీనివాసులు, ఐసీడీఎస్‌ సీడీపీవో రేణుక, ఏఎ్‌సడబ్ల్యూవో డీసీ వేమయ్య, విద్యాశాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 01:29 AM