Share News

ప్రాణం తీసిన ఫ్లెక్సీ

ABN , Publish Date - Aug 15 , 2026 | 01:22 AM

ద్రౌపదీ సమేత ధర్మరాజు స్వామి తిరునాళ్లను పురస్కరించుకుని ఫ్లెక్సీ ఏర్పాటు చేసే క్రమంలో విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి చెందారు.

ప్రాణం తీసిన ఫ్లెక్సీ
గోకుల్‌, విఘ్నేష్‌

విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి

పుత్తూరు అర్బన్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి):ద్రౌపదీ సమేత ధర్మరాజు స్వామి తిరునాళ్లను పురస్కరించుకుని ఫ్లెక్సీ ఏర్పాటు చేసే క్రమంలో విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి చెందారు.పోలీసుల కథనం మేరకు..పుత్తూరులో శనివారం నుంచి తిరునాళ్ల ప్రారంభం కానుంది. స్థానిక యువకులు విఘ్నేష్‌(20), గోకుల్‌(19) తిరునాళ్ల సందర్భంగా స్నేహితుల చిత్రాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని భావించారు. శుక్రవారం మధ్యాహ్నం కేఎన్‌ రోడ్డులో మౌనిక ఆప్టికల్స్‌ సమీపంలోని పూజా టెక్స్‌టైల్స్‌ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసే క్రమంలో 11 కేవీ విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌కు గురై మృతి చెందారు. తిరునాళ్ల ఆనందాన్ని పంచుకోవాలనుకున్న ఫ్లెక్సీ.. చివరకు రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Aug 15 , 2026 | 01:22 AM