ఎర్రచందనం స్మగ్లర్‌కు ఐదేళ్ల జైలు
ABN , Publish Date - Aug 01 , 2026 | 01:53 AM
మదనపల్లె అటవీప్రాంతంలో ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డ సునీల్‌కుమార్(30)కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3లక్షల జరిమానా విఽధిస్తూ ఆర్‌ఎ్‌సఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు.
రామచంద్రాపురం, జూలై 31(ఆంధ్రజ్యోతి): మదనపల్లె అటవీప్రాంతంలో ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డ సునీల్‌కుమార్(30)కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3లక్షల జరిమానా విఽధిస్తూ ఆర్‌ఎ్‌సఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ఎర్రచందనం టాస్క్‌ఫోర్సు ఎస్పీ శ్రీనివాస్ కథనం మేరకు...2021లో అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం మట్లివారిపల్లెకు చెందిన బూచి సునీల్‌కుమార్ కుక్కరాజుపల్లె అటవీ బీట్ పరిధిలో 11 ఎర్రచందనం దుంగలను నరికి తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు.నిందితుడిపై నేరారోపణ రుజువు కావడంతో ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.3లక్షల జరిమానా విధించారు. ఎర్రచందనం టాస్క్‌ఫోర్సు తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమర నారాయణ వాదించారు.