Share News

ఐదు టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , Publish Date - Apr 20 , 2026 | 01:46 AM

ఐదు టన్నుల రేషన్‌ బియ్యం పట్టుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. తిరుపతి విజిలెన్స్‌ ఎస్పీ కరీముల్లా షరీఫ్‌ తెలిపిన వివరాల మేరకు.. విశ్వసనీయ సమాచారంతో నారాయణవనం పడివేటమ్మ ఎస్టీ కాలనీలో తనిఖీలు చేపట్టారు. నెంబరు లేని లగేజీ వాహనంలో రవాణాకు సిద్ధంగా ఉంచిన ఐదు టన్నుల రేషన్‌ బియ్యాన్ని గుర్తించారు. వాహనంతోపాటు రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకుని, నారాయణవనం కీళగరం బీసీ కాలనీకి చెందిన పెరుమాల్‌ (42), రాజా (55)ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై తదుపరి చర్యల నిమిత్తం వారిని నారాయణవనం పోలీసులకు అప్పగించారు.

ఐదు టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత
నెంబరు లేని లగేజీ వాహనం, స్వాధీనం చేసుకున్న బియ్యం బస్తాలు

  • ఇద్దరిని అరెస్ట్‌ చేసిన తిరుపతి విజిలెన్స్‌ అధికారులు

తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఐదు టన్నుల రేషన్‌ బియ్యం పట్టుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. తిరుపతి విజిలెన్స్‌ ఎస్పీ కరీముల్లా షరీఫ్‌ తెలిపిన వివరాల మేరకు.. విశ్వసనీయ సమాచారంతో నారాయణవనం పడివేటమ్మ ఎస్టీ కాలనీలో తనిఖీలు చేపట్టారు. నెంబరు లేని లగేజీ వాహనంలో రవాణాకు సిద్ధంగా ఉంచిన ఐదు టన్నుల రేషన్‌ బియ్యాన్ని గుర్తించారు. వాహనంతోపాటు రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకుని, నారాయణవనం కీళగరం బీసీ కాలనీకి చెందిన పెరుమాల్‌ (42), రాజా (55)ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై తదుపరి చర్యల నిమిత్తం వారిని నారాయణవనం పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన రేషన్‌ బియ్యాన్ని గోడౌన్‌కు తరలించారు.

Updated Date - Apr 20 , 2026 | 01:46 AM