Share News

డ్రగ్‌ డిటెక్షన్‌ పరీక్షల్లో ఐదుగురికి పాజిటివ్‌

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:47 AM

‘ధైర్యస్పర్శ- ఆపరేషన్‌ ఫ్లష్‌ అవుట్‌’లో భాగంగా ఆదివారం జిల్లాలో డ్రగ్‌ డిటెక్షన్‌ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 70 మందికి పరీక్షలు చేయగా, ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

డ్రగ్‌ డిటెక్షన్‌ పరీక్షల్లో ఐదుగురికి పాజిటివ్‌
రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న నాన్‌ క్యాడర్‌ ఎస్పీ రాజశేఖర్‌ రాజు

చిత్తూరు అర్బన్‌, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): ‘ధైర్యస్పర్శ- ఆపరేషన్‌ ఫ్లష్‌ అవుట్‌’లో భాగంగా ఆదివారం జిల్లాలో డ్రగ్‌ డిటెక్షన్‌ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 70 మందికి పరీక్షలు చేయగా, ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అమ్మకాలు, వినియోగాన్ని అరికట్టడంతో పాటు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌లో ఈ పరీక్షలు జరిపారు. కార్వేటినగరంలో 450 లీటర్ల సారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేశారు. చిత్తూరు వన్‌టౌన్‌, టూటౌన్‌ పోలీసు స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు నాన్‌ క్యాడర్‌ ఎస్పీ రాజశేఖర్‌ రాజు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తమ పరిసరాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల విక్రయాలు, వినియోగం, నిల్వలు లేదా రవాణా జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే చిత్తూరు ఎస్‌బీ సీఐ 94906 17896 నెంబరుకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

Updated Date - Jun 08 , 2026 | 12:47 AM