టీసీరాజన్‌కు అంతిమ నివాళి
ABN , Publish Date - Mar 22 , 2026 | 01:07 AM
స్వాతంత్య్ర సమరయోధుడు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. శనివారం సాయంత్రం ఆయన అంతిమయాత్రలో కుటుంబసభ్యులు, పట్టణ వాసులు అశ్రునయనాలతో పాల్గొన్నారు. దివంగత నాయకుడికి జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, శాంతిపురం జడ్పీటీసీ శ్రీనివాసులు, చిత్తూరు బీజేపీ నాయకులు చిట్టిబాబు, పలమనేరు పరిరక్షణ సమితి నాయకులు నరసింహులు, ఎన్జీవో సంఘ అధ్యక్షుడు ఆనందబాబు, కార్యదర్శి నారాయణ, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పలమనేరు, మార్చి21(ఆంధ్రజ్యోతి) : స్వాతంత్య్ర సమరయోధుడు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. శనివారం సాయంత్రం ఆయన అంతిమయాత్రలో కుటుంబసభ్యులు, పట్టణ వాసులు అశ్రునయనాలతో పాల్గొన్నారు. దివంగత నాయకుడికి జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, శాంతిపురం జడ్పీటీసీ శ్రీనివాసులు, చిత్తూరు బీజేపీ నాయకులు చిట్టిబాబు, పలమనేరు పరిరక్షణ సమితి నాయకులు నరసింహులు, ఎన్జీవో సంఘ అధ్యక్షుడు ఆనందబాబు, కార్యదర్శి నారాయణ, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ దేశసేవ చేయడానికి అవకాశం భగవంతుడు కొద్దిమందికే ఇస్తాడని, అలాంటి అదృష్టవంతుల్లో రాజన్ ఒకరన్నారు. వందేళ్లకుపైగా ఆరోగ్యంగా జీవించడం క్రమశిక్షణతో కూడిన జీవన విధానానికి నిదర్శనమన్నారు. వీరితో పాటు విజయకుమార్‌రెడ్డి, పొన్ముడి, వెంకట్, రామచంద్ర, శ్రీపురం సీతారామయ్య, వీరభద్రగౌడు, దొరస్వామి, విజయకుమార్, రెడ్డెప్ప. సురేంద్ర, వెంకటేశ్వర్లు, శేఖర్, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.