Share News

టీచర్ల తుది సీనియారిటీ జాబితా విడుదల

ABN , Publish Date - Jul 12 , 2026 | 01:19 AM

టీచర్ల తుది సీనియారిటీ జాబితాను శనివారం విడుదల చేసినట్లు ఇన్‌చార్జి డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు ప్రొవిజినల్‌ జనరల్‌ సీనియారిటీ జాబితా టీచర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (టీఐఎ్‌స)లో వివరాలు నమోదు చేశారన్నారు.

టీచర్ల తుది సీనియారిటీ జాబితా విడుదల

చిత్తూరు సెంట్రల్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి): టీచర్ల తుది సీనియారిటీ జాబితాను శనివారం విడుదల చేసినట్లు ఇన్‌చార్జి డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు ప్రొవిజినల్‌ జనరల్‌ సీనియారిటీ జాబితా టీచర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (టీఐఎ్‌స)లో వివరాలు నమోదు చేశారన్నారు. సేవా వివరాల ఆధారంగా ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా అభ్యంతరాలు స్వీకరించినట్లు తెలిపారు. వీటిని సవరించి తుది సీనియారిటీ జాబితాను డీవైఈవో, ఎంఈవో ఈ-మెయిల్‌లో పొందుపర్చామన్నారు. జాబితాను తుది జాబితాగా పరిగణించింది. ఈ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని డీఈవో సూచించారు.

Updated Date - Jul 12 , 2026 | 01:19 AM