సుదీర్ఘ సేవలకు సత్కారం
ABN , Publish Date - Aug 01 , 2026 | 02:01 AM
పోలీసు శాఖలో సుదీర్ఘకాలంపాటు సేవలందించి.. ఉద్యోగ విరమణ పొందిన నలుగురు పోలీస్ అధికారులను ఎస్పీ సుబ్బరాయుడు సత్కరించి, వీడ్కోలు పలికారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది.
నలుగురు పోలీసు అధికారులకు ఘనంగా వీడ్కోలు
తిరుపతి(నేరవిభాగం), జూలై 31 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో సుదీర్ఘకాలంపాటు సేవలందించి.. ఉద్యోగ విరమణ పొందిన నలుగురు పోలీస్ అధికారులను ఎస్పీ సుబ్బరాయుడు సత్కరించి, వీడ్కోలు పలికారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. తిరుపతి క్రైమ్ డీఎస్పీగా పనిచేస్తూ శాఖలో 44 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న డీఎస్పీ శ్యామ్ సుందరం, 43 ఏళ్లపాటు పనిచేసిన నాయుడుపేట ఏఎ్‌సఐ ఎన్.దయానిధి నాయుడు, 40 ఏళ్లపాటు సేవలందించిన తిరుపతి ట్రాఫిక్ ఎస్‌ఐ కె.బాలాజి, 36 ఏళ్ల సర్వీసు చేసిన తిరుపతి మహిళా పోలీ్‌సస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎ.ఆర్ముగం శుక్రవారంతో ఉద్యోగ విరమణ చేశారు. విధి నిర్వహణలో వీరి చూపిన ప్రతిభను ఎస్పీ ప్రశంసించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాసులు, రవి మనోహరాచారి, ఐ.రామకృష్ణ, శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ గీతాకుమారి, పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు సోము, శంకర్ రెడ్డి, శేఖర్, ఉద్యోగ విరమణ చేసినవారి కుటుంబీకులు పాల్గొన్నారు.