ఫలితాలు రాకపోతే సీఎం, కలెక్టర్ ఆగ్రహిస్తారనే భయం
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:51 AM
ఇక్కడ తొమ్మిది.. అక్కడ పది. ఈ లెక్కేంటని అనుకుంటున్నారా? సాంఘిక సంక్షేమశాఖ అధికారుల లెక్కలివి. ఎస్సీ హాస్టల్ రిజిస్టర్‌లో ఆ విద్యార్థుల పేర్లన్నీ తొమ్మిదవ తరగతిలో ఉంది. అవే పేర్లు పాఠశాల రిజిస్టర్‌లో మాత్రం పదో తరగతిలో ఉన్నాయి. ఎందుకిలా ఉన్నాయో చూద్దాం.
ఇక్కడ తొమ్మిది.. అక్కడ పది. ఈ లెక్కేంటని అనుకుంటున్నారా? సాంఘిక సంక్షేమశాఖ అధికారుల లెక్కలివి. ఎస్సీ హాస్టల్ రిజిస్టర్‌లో ఆ విద్యార్థుల పేర్లన్నీ తొమ్మిదవ తరగతిలో ఉంది. అవే పేర్లు పాఠశాల రిజిస్టర్‌లో మాత్రం పదో తరగతిలో ఉన్నాయి. ఎందుకిలా ఉన్నాయో చూద్దాం.
- చిత్తూరు అర్బన్, ఆంధ్రజ్యోతి
వి.కోటలోని సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహంలో 6 నుంచి పదో తరగతి వరకు 90 మంది విద్యార్థులున్నారు. వారిలో 20 మంది వరకు టెన్త్ విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. టెన్ ్తలో ఆశించిన ఫలితాలు రాకపోతే కలెక్టర్ నుంచి మాటపడటమే కాకుండా.. ఆ ప్రభావం ఉద్యోగ జీవితంపై పడుతుందని అధికారులు అనుకున్నారు. దాంతో అక్కడ టెన్త్‌లోని 20 మందిలో హరికృష్ణ, బాలకృష్ణ, మంజునాథ్, గోపిచంద్ర కొంతవరకు బాగా చదివే వారని తెలిసింది. వారిని టెన్ ్త క్లాస్ చదువుతున్నట్లు హాస్టల్ రిజిస్టర్‌లో నమోదు చేయడంతో పాటు అదే సమాచారాన్ని జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు ఆన్‌లైన్ డేటాబే్‌సలో చూపించారు. మిగిలిన విద్యార్థులైన సుప్రీమ్, ప్రదీప్, గణేష్, మహేష్, వెంకటేశ్, పళణి, మధు, యోగేష్, ఈశ్వర్‌తో పాటు మరో ఏడుగురిని తొమ్మిదవ తరగతి చదువుతున్నట్లు హాస్టల్ రికార్డుల్లో చూపించారు. ఈ 20 మంది మాత్రం పాఠశాలలో టెన్త్‌క్లా్‌సలో ఉన్నట్లు అక్కడి రికార్డుల్లో ఉన్నాయి. దీనిపై ఓ విద్యార్థి తండ్రి ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయానికి పోస్ట్‌లో లేఖ పంపారు. పోయినసారి మా ఊర్లోని పిల్లలు 9వ తరగతి చదివారు. ఇప్పుడు పదికి పోయారు. స్కూల్లో పదిలో చూపించి.. హాస్టల్లో 9వ తరగతి చూపిస్తున్నారు. మాకెందుకో అర్థం కాలేదు. దీనిపై కలెక్టర్‌కు కూడా కంప్లైంట్ చేశా. అధికారులు విచారించాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఎందుకిలా చేశారు?
ఏటా బీసీ సంక్షేమశాఖ కన్నా సాంఘిక సంక్షేమశాఖ ఫలితాలు తక్కువగానే ఉంటాయి. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక హాస్టల్‌లో 20 మంది విద్యార్థుల్లో 16 మంది ఫెయిలైతే 20 శాతం ఫలితాన్ని చూపించాలి. అదే 20 మందిలో బాగా చదివే నలుగురిని చూపించి.. వారంతా పాస్ అయితే వంద శాతం పాస్ అని చెప్పుకోవచ్చు. ఇందుకోసం ఆ హాస్టల్‌లో బాగా చదివే నలుగురిని మాత్రం టెన్త్‌క్లా్‌సలో చూపించారు. మిగిలిన వారిని తొమ్మిదవ తరగతిలో చూపించారు. 16 మంది విద్యార్థులు తొమ్మిదవ తరగతిలో ఉన్నట్లు తల్లిదండ్రులకు లేదా బయట ఎక్కడైనా చెబితే భవిష్యత్తు ఉండదని విద్యార్థులకు భయం పెట్టారని సమాచారం. ఇక, వారంతా పాస్ లేదా ఫెయిలైన తర్వాత తిరిగి హాస్టల్‌కు రారు. వచ్చే ఏడాది తొమ్మిదవ తరగతి విద్యార్థులంతా టెన్త్ క్లాస్‌కు అప్‌గ్రేడ్ చేయాలి. వచ్చే ఏడాదిలో వారు హాస్టల్‌లో చేరలేదని ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి చేతులు దులుపుకొంటారని విశ్వసనీయ వర్గాలు చూపాయి.