టమోటా ధరల్లేక రైతులు విలవిల
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:16 AM
టమోటా ధరల్లేక రైతులు విలవిలలాడుతున్నారు
టమోటా ధరల్లేక రైతులు విలవిలలాడుతున్నారు. కుప్పంలో మార్కెట్ ఉండటం.. ఇక్కడి వాతావరణం అనుకూలం కావడంతో సంవత్సరం పొడవునా గుడుపల్లె మండలంలోని రైతులు టమోటా సాగుచేస్తారు. కొన్ని నెలలుగా 15 కిలోల బాక్సు ధర రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. కుప్పం మార్కెటుకు వచ్చే వ్యాపారులు ఇక్కడ టమోటాను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. అక్కడ రాష్ట్రాల్లో టమోటా దిగుబడి ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు టమోటా కొనుగోలుకు మొగ్గు చూపడంలేదు. దీంతో రైతులు టమోటాను మార్కెట్ తీసుకొస్తే కొందరు వ్యాపారులు స్థానికంగా అమ్మడానికి మేలు రకం టమోటాను కొనుగోలు చేసి మిగతా వాటి కొనుగోలుకు మొగ్గుచూపడంలేదు. దీంతో రైతులు టమోటాను మార్కెట్‌లోనే ఉంచి తమ గ్రామాలకు చేరుకొంటున్నారు. టమోటా ధరలతో కోత కూలీ కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు టమోటాను తోటల్లో కోయకుండా వదిలివేస్తున్నారు. మరికొందరైతే టమోటా పంటను ట్రాక్టర్ ద్వారా దున్ని ఇతర పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు.
- గుడుపల్లె, ఆంధ్రజ్యోతి