కుటుంబ ఆరోగ్యమే దేశ సౌభాగ్యం
ABN , Publish Date - Jul 12 , 2026 | 01:49 AM
కుటుంబ ఆరోగ్యమే దేశ సౌభాగ్యమంటూ డీఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మీనరసయ్య అన్నారు. శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
డీఎంహెచ్‌వో లక్ష్మీనరసయ్య
మదనపల్లె క్రైం, జూలై 11(ఆంధ్రజ్యోతి): కుటుంబ ఆరోగ్యమే దేశ సౌభాగ్యమంటూ డీఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మీనరసయ్య అన్నారు. శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ పిల్లల మధ్య వ్యవధి పాటిద్దాం-ఆరోగ్యవంతమైన కుటుంబాన్ని నిర్మిద్దాం నినాదంతో ఈనెల 11 నుంచి 18వ తేదీ వరకు జనాభా దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాల్య వివాహాలతో మాతాశిశు మరణాలు సంభవిస్తాయన్నారు. జనాభా సమతుల్యత, స్థిరీకరణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహ్మద్‌రఫీ, ప్రభాకర్, గంగయ్య పాల్గొన్నారు.