Share News

మేయర్‌ దంపతుల హత్య కేసులో తప్పుడు సాక్షులకు 6న వాయిదా

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:36 AM

మేయర్‌ అనురాధ దంపతుల హత్యకేసులో తప్పుడు సాక్ష్యం చెప్పిన 19 మందికి సంబంధించిన కేసును వచ్చేనెల 6వ తేదికి న్యాయమూర్తి వాయిదా వేశారు.

  మేయర్‌ దంపతుల హత్య కేసులో తప్పుడు సాక్షులకు 6న వాయిదా

చిత్తూరు లీగల్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): మేయర్‌ అనురాధ దంపతుల హత్యకేసులో తప్పుడు సాక్ష్యం చెప్పిన 19 మందికి సంబంధించిన కేసును వచ్చేనెల 6వ తేదికి న్యాయమూర్తి వాయిదా వేశారు. 2015 నవంబరు 17న కటారి అనురాధ, కటారి మోహన్‌ నగరపాలక సంస్థ కార్యాలయంలో హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ప్రధాన నిందితుడు చింటూతో పాటు మరో 22 మందిపై చిత్తూరు వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో 2025 అక్టోబరు 31న చింటూతో పాటు మరో నలుగురికి చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు ఉరిశిక్ష వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టుకు తప్పుడు సాక్ష్యం చెప్పిన 19 మందికి న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. ఈ కేసు బుధవారం 9వ కోర్టులో వాయిదా ఉండగా, న్యాయమూర్తి వచ్చేనెల 6వ తేదికి వాయిదా వేశారు.

Updated Date - Jan 29 , 2026 | 12:36 AM