Share News

మేయర్‌ పదవిపై కన్ను

ABN , Publish Date - Sep 02 , 2026 | 01:29 AM

చిత్తూరు మేయర్‌ పదవిపై పలువురు ఆశలు పెంచుకుంటున్నారు. ముందుగా నగరపాలక, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమకు అనుకూలంగా మేయర్‌ పీఠం రిజర్వు అయితే, అభ్యర్థిత్వం ఇప్పించాలంటూ అటు కూటమి, ఇటు వైసీపీలోనూ ఆశావహులు జోరుగా ప్రయత్నాలు చేపట్టారు.

మేయర్‌ పదవిపై కన్ను

రిజర్వేషన్లకు అనుగుణంగా తమ పేర్లను పరిశీలించాలంటూ ఆశావహుల ప్రయత్నాలు

చిత్తూరు, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు మేయర్‌ పదవిపై పలువురు ఆశలు పెంచుకుంటున్నారు. ముందుగా నగరపాలక, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమకు అనుకూలంగా మేయర్‌ పీఠం రిజర్వు అయితే, అభ్యర్థిత్వం ఇప్పించాలంటూ అటు కూటమి, ఇటు వైసీపీలోనూ ఆశావహులు జోరుగా ప్రయత్నాలు చేపట్టారు.

ఓసీ అయితే: చిత్తూరు మేయర్‌ పదవి ఈసారి ఓసీ లేదా బీసీలకు వస్తుందని అంచనా. ఓసీలకు వస్తే కూటమి తరపున కాజూరు బాలాజీ (బలిజ), మద్దిపట్ల ఈశ్వరరావు (కమ్మ) ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లితో కాజూరుకు సాన్నిహిత్యం ఉంది. ఈశ్వరరావు.. దివగంత పారిశ్రామికవేత్త సుందరనాయుడు అక్క కుమారుడు.

ఫ వైసీపీలో ప్రస్తుత నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి విజయానందరెడ్డి సతీమణి ఇందుమతికి మొదటి ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. జ్యోతిరెడ్డి మేనకోడలు, మాజీ కార్పొరేటర్‌ హరిణిరెడ్డి.. రాహుల్‌రాజారెడ్డి కూడా తమ ప్రయత్నాల్లో ఉన్నారు. వీరిలో రాహుల్‌రెడ్డికి పెద్దిరెడ్డి ఆశీస్సులున్నట్లు తెలుస్తోంది.

బీసీలకు రిజర్వు అయితే: కూటమి నుంచి సీకే లావణ్య (మరాఠీలు), కఠారి హేమలత (బీసీ, బలిజ) బలంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి జిల్లాకు వచ్చినప్పుడు సీకే ఇంటికి వెళ్లడం, ఇటీవల ఆమె ఎమ్మెల్యే గురజాలతో కలిసి కార్యక్రమాల్లో చురుగ్గా కఠారి హేమలత పాల్గొంటున్నారు. ఇక, చుడా చైర్‌పర్సన్‌గా ఉన్న కఠారి హేమలత మేయర్‌ పోస్టుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈమె తరఫున చిత్తూరుకు చెందిన సీనియర్‌ నేత ఒకరు అధిష్ఠానం వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఫ ఇక, వైసీపీలో మాజీ డిప్యూటీ మేయర్‌, అడ్వకేట్‌ చంద్రశేఖర్‌తో పాటు మాజీ కార్పొరేటర్‌ జ్ఞాన జగదీష్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

ఎస్సీలకు అనుమానమే: గత ఎన్నికల్లో మేయర్‌ పోస్టు ఎస్సీలకు రిజర్వు కావడంతో ఈసారి ఆ వర్గానికి వచ్చే అవకాశాలు అనుమానమే. ఒకవేళ ఎస్సీలకు రిజర్వు అయితే కూటమి నుంచి మాజీ మేయర్‌ అముద, మాజీ కార్పొరేటర్‌ అశోకన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో అముద వైసీపీ నుంచి మేయర్‌ కాగా, సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు.

ఫ వైసీపీ తరపున శంకరయ్యగుంట అన్బు పేరు వినిపిస్తోంది. ఈయన తన తల్లిని లేదా సతీమణిని బరిలోకి దింపే అవకాశముంది. 2021 ఎన్నికల్లో అన్బు తల్లి పూమణి మేయర్‌గా దాదాపు ఖరారైంది. ఈమె ఎన్నిక కోసం మెజార్టీ కార్పొరేటర్లను విజయానందరెడ్డి ఏకం చేశారు. అప్పటి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విన్నపం మేరకు వైసీపీ అధష్ఠానం అముద వైపు మొగ్గు చూపింది.

Updated Date - Sep 02 , 2026 | 01:29 AM