కాణిపాకంలో నాణ్యమైన లడ్డూ తయారీపై ప్రయోగం
ABN , Publish Date - Jan 05 , 2026 | 02:03 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో నాణ్యమైన లడ్డూలు తయారీకి ఆదివారం పోటులో ఆలయ చైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షణలో సిబ్బంది ఓ ప్రయోగాన్ని నిర్వహించారు.
విజయవాడ, శ్రీకాళహస్తి ఆలయాల్లో పాటించే విధానాల అమలు
ఐరాల(కాణిపాకం), జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో నాణ్యమైన లడ్డూలు తయారీకి ఆదివారం పోటులో ఆలయ చైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షణలో సిబ్బంది ఓ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్, ఈవో మాట్లాడుతూ లడ్డూ ఎక్కువ రోజులు నిల్వలేకుండా పోతోందని గుర్తించామన్నారు. లడ్డూ నాణ్యతను తగ్గకుండా ఉంచడానికి విజయవాడ, శ్రీకాళహస్తి ఆలయాల్లో పాటించే విధానాలను అమలు చేసి, పరిశీలించామన్నారు. పాత విధానంలో తయారు చేసే బూందీ సాగి పోతున్నట్లు గుర్తించామన్నారు. కొత్త విధానంలో బూందీ గుండ్రంగా తయారవుతోందని, లడ్డూ చూడముచ్చటగా ఉండి, త్వరగా పాడవకుండా ఉంటుందన్నారు. ఈ విధానం పూర్తిగా విజయం సాధిస్తే త్వరలో నాలుగు యూనిట్లను ఏర్పాటు చేసి లడ్డూ తయారీ చేస్తామని వెల్లడించారు.