Share News

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ మృతి

ABN , Publish Date - May 25 , 2026 | 12:53 AM

రామసముద్రం ఎక్సైజ్‌ పోలీ్‌సస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రెడ్డెయ్య ఆదివారం మృతి చెందారు. కలకడ మండలం పోతువారిపల్లెకు చెందిన ఆయన ఆదివారం ఉదయం విధి నిర్వహణలో ఉండగా అస్వస్థతకు గురయ్యారు.

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ మృతి
రెడ్డెయ్య (ఫైల్‌ ఫొటో)

రామసముద్రం, మే 24(ఆంఽధ్రజ్యోతి): రామసముద్రం ఎక్సైజ్‌ పోలీ్‌సస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రెడ్డెయ్య ఆదివారం మృతి చెందారు. కలకడ మండలం పోతువారిపల్లెకు చెందిన ఆయన ఆదివారం ఉదయం విధి నిర్వహణలో ఉండగా అస్వస్థతకు గురయ్యారు. సహచర సిబ్బంది మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. రెడ్డెయ్య మృతితో ఎక్సైజ్‌ శాఖలో విషాదఛాయలు అలముకున్నాయి. అధికారులు, సిబ్బంది ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల రోదన అక్కడి వారిని కంటతడి పెట్టించింది.

Updated Date - May 25 , 2026 | 12:53 AM