Share News

గరుడ సేవకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Oct 16 , 2026 | 01:59 AM

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి మలయప్పస్వామి గరుడ వాహనంపై మాడవీఽఽధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తుల కంటే దాదాపు 30 శాతం మంది అధికంగా వస్తారన్న అంచనాతో టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

గరుడ సేవకు సర్వం సిద్ధం

తిరుపతి(టీటీడీ), అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి మలయప్పస్వామి గరుడ వాహనంపై మాడవీఽఽధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తుల కంటే దాదాపు 30 శాతం మంది అధికంగా వస్తారన్న అంచనాతో టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. భక్తులకు అన్నప్రసాదాలతోపాటు ఉప్మా, పొంగల్‌, సాంబార్‌ అన్నం, టమోటా రైస్‌, చక్కెర పొంగలి, పులిహోర ఇవ్వనున్నారు. వీటితోపాటు పాలు, బాదంపాలు, కాఫీ, మజ్జిగ ప్యాకెట్లు, టెట్రా జ్యూస్‌ ప్యాకెట్లు, సుండలు, బిస్కెట్‌లు అందించనున్నారు. ఫ భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గురువారం రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఘాట్‌రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించారు. తిరుమలలోని గ్యాలరీలు నిండిపోయి, రహదారులన్నీ కూడా భక్తులతో ఉన్నట్లయితే చివరిగా వచ్చే భక్తులను కింద ఏర్పాటు చేసిన హోల్డింగ్‌ పాయింట్లకు తరలించనున్నారు. అక్కడ ఎల్‌ఈడీ స్ర్కీన్లతోపాటు భక్తులకు అవసరమైన అన్నప్రసాదాలు అందుబాటులో ఉంచారు. ఫ తిరుమల ఆలయం చుట్టూ మాడవీధుల వెంట ఉన్న గ్యాలరీల్లో సుమారు 1.20 లక్షల మంది పట్టే ఆస్కారం ఉంది. అయితే ఎక్కువ మందికి దగ్గర నుంచి వాహనసేవ దర్శనం కల్పించేందుకు స్వామి వాహనం హథీరాంజీ మఠం దాటిన వెంటనే గొల్లమండపం, అఖిలాండం ముందు భాగంలో ఉన్న భక్తులను ఖాళీ చేయించి అక్కడ మళ్లీ అక్కడ మరికొందరి భక్తులతో రీ ఫిల్లింగ్‌ చేయించనున్నారు. అలాగే సుపథంతోపాటు నైరుతి మూలన ఉన్న గేటు నుంచి స్వామి వాహనం పక్క నుంచి రెండు వరుసలు తాళ్లు వేయనున్నారు. మేదరమిట్ట, తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం ప్రాంతాల నుంచి భక్తులను అనుమతించనున్నారు. తద్వారా ఎక్కువ మందికి స్వామి దర్శనం కల్పించనున్నారు.ఫ ప్రజా రవాణా వ్యవస్థను మరింత పెంచి దాదాపు 3100 ట్రిప్పులు వేసేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా భక్తులు ఆర్టీసీని వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు.

Updated Date - Oct 16 , 2026 | 01:59 AM