Share News

పాత్ర మారినా జ్ఞాపకాలు పదిలం

ABN , Publish Date - Sep 28 , 2026 | 01:14 AM

నాటి జడ్పీ అతిథి గృహమే నేటి జడ్పీ కార్యాలయం

పాత్ర మారినా జ్ఞాపకాలు పదిలం
ఉడా కార్యాలయంలో ఏర్పాటైన జిల్లా పరిషత్తు కార్యాలయం

మదనపల్లె, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): కడప నుంచి విడిపోయిన చిత్తూరు జిల్లా 1911 ఏప్రిల్‌ ఒకటిన ఏర్పడింది. అప్పట్లో మదనపల్లె, వాయల్పాడు తాలూకాలు చిత్తూరు జిల్లాలో భాగంగా ఉండేవి. 1959 డిసెంబరు ఒకటిన అప్పటి ఏపీ పంచాయతీ సమితులు-జిల్లా పరిషత్తుల చట్టం-1959 చిత్తూరు జిల్లా పరిషత్తు ఏర్పాటైంది. జిల్లాలో భాగమైన మదనపల్లె డివిజన్‌ కేంద్రం కావడంతో జిల్లా పరిషత్తు ఆస్తికి సంబంధించిన ఈ భూమిలో జడ్పీ గెస్ట్‌హౌస్‌ నిర్మించారు. అప్పటి నుంచి పంచాయతీరాజ్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులు, సినీ ప్రముఖులు ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా పుంగనూరు రోడ్డులోని ఈ జడ్పీ అతిథిగృహంలో విడిది చేసేవారు. ఇలా 60 ఏళ్లుగా ఆ భవనాన్ని జడ్పీ గెస్ట్‌ హౌస్‌గా పిలిచేవారు. అదే ప్రస్తుతం జిల్లాల విభజనతో జిల్లా పరిషత్తు కార్యాలయంగా మార్పుచెందింది. ఇది కాకతాళీయంగా జరిగినా ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. మొదటిసారి వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 వరకూ ఆ భవనం అదే పేరుతో ఉండేది. తర్వాత పలమనేరు, పుంగనూరు, మదనపల్లె అర్బన్‌ అఽథారిటీ(పీకేఎం-ఉడా) కారాల్యయంగా మారిపోయింది. ఇందులో చైర్మన్‌గా మొదటిసారి పుంగనూరుకు చెందిన ఎన్‌.వెంకటరెడ్డియాదవ్‌, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుప్పానికి చెందిన బి.ఆర్‌.సురే్‌షబాబు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జిల్లా పరిషత్తుకు పదవీకాలం ముగిసిపోవడంతో ప్రతి జిల్లాకూ జిల్లా పరిషత్తు ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గుచూపింది. ఇందులో భాగంగా పీకేఎం ఉడా కాస్త అన్నమయ్య జిల్లా అభివృద్ధి సంస్థ(ఉడా) కార్యాలయంగా మారింది. అయితే కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా పరిషత్తు కార్యాలయాన్ని..తన సొంత స్థలాలైన జడ్పీ మైదానంలోని పంచాయతీరాజ్‌ ఈఈ కార్యాలయంపై భాగంలో ఉన్న భవనంలో ఏర్పాటు చేయాలని మొదట నిర్ణయించారు. అయితే అక్కడి ఈఈ కార్యాలయం నుంచి అభ్యంతరం రావడంతో చివరకు ఉడా కార్యాలయానికి మారిపోయింది. జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి అయిన కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ చేతుల మీదుగా హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. అయితే ఇక్కడ నడుస్తున్న ఉడా కార్యాలయం పరిస్థితే అగమ్యగోచరంగా మారింది. ఉడా చైర్మన్‌ బి.ఆర్‌.సురే్‌షబాబు, వైస్‌ చైర్మన్‌, జేసీ శివనారాయణశర్మ వ్యవహరిస్తున్న ఈ కార్యాలయాన్ని మరో చోటికి మార్చాల్చి వస్తోంది. ఉన్న కార్యాలయాన్ని ఖాళీ చేసి కొత్తగా వెతుక్కోవాల్సి వస్తోందని ఆశాఖ ఉద్యోగులు వాపోతున్నారు.

Updated Date - Sep 28 , 2026 | 01:14 AM