పుట్టెడు దుఖంలోనూ పదో తరగతి పరీక్షకు
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:41 AM
ఆదివారం.. తల్లి మరణం, అంత్యక్రియలు.
ఆదివారం.. తల్లి మరణం, అంత్యక్రియలు. సోమవారం.. ఉదయాన్నే పదో తరగతి పరీక్ష. పుట్టెడు దుఖంతో పూర్ణిమ తొలిపరీక్షకు హాజరయ్యారు. ఈమెది నగరి మున్సిపాలిటీ పరిధిలోని నెత్తంకండ్రిగ. స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అనారోగ్యం కారణంగా పూర్ణిమ తల్లి మునిలక్ష్మి ఆదివారం ఉదయం మృతి చెందింది. మరుసటి రోజు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమైన పూర్ణిమను తల్లి మరణం తీవ్రంగా బాధించింది. గుండెలవిసేలా విలపించిన విద్యార్థిని గుండె నిబ్బరంతో సోమవారం ఉదయం ప్రారంభమైన పదో తరగతి మొదటి పరీక్ష రాసిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
- నగరి, ఆంధ్రజ్యోతి