89 ఏళ్లలో కూడా సైకిలే వాహనం
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:32 AM
ఐదున్నర దశాబ్దాలుగా ఆయన సైకిల్ తొక్కుతున్నారు. 89ఏటా ఎంచక్కా సైకిలే ఆయనకు రవాణా వాహనం. సదుం బెస్త వీధికి చెందిన ఎస్.వెంకటరమణది వ్యవసాయ కుటుంబం.
సదుం, జూన్ 14(ఆంధ్రజ్యోతి): ఐదున్నర దశాబ్దాలుగా ఆయన సైకిల్ తొక్కుతున్నారు. 89ఏటా ఎంచక్కా సైకిలే ఆయనకు రవాణా వాహనం. సదుం బెస్త వీధికి చెందిన ఎస్.వెంకటరమణది వ్యవసాయ కుటుంబం. ఊరికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో కొంచెం పొలం ఉంది. పొలం పనుల నిమిత్తం అతడు 31వ ఏట నుంచి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం అలవాటు చేసుకున్నారు. 58 ఏళ్లుగా సైకిల్‌పై రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం వయస్సు మీద పడి నడవలేని పరిస్థితి. అయినా కొంత దూరమైనా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం తనకు సులభంగానే ఉంటుందంటున్నారు వెంకటరమణ. ‘వయసు మీద పడినా, నా పనులు సొంతంగా చేసుకుంటూనే ఇంటి పనులు, పొలం పనులకు సైకిల్ మీదే వెళ్లి వస్తుంటాను. రోజువారీ పనుల్లో సైకిల్ నాకు ప్రధాన సాధనం. బీపీ, షుగర్, చూపు తగ్గడం, వినికిడి తగ్గడం లాంటి సమస్యలు లేవు. ఒంట్లో సత్తువ తగ్గిపోయింది. సైకిల్ లేనిదే ఎక్కడికీ వెళ్లలేను’ అంటున్నాడు ఆయన. పిల్లలు కూడా సైకిల్ తొక్కని ఈ రోజుల్లో వెంకటరమణ సైకిల్‌పై వెళుతుండడం చూసి స్థానికంగా ‘ఔరా’ అని ముక్కున వేలు వేసుకుంటున్నారు.