జిల్లా జువెనైల్ జస్టిస్ బోర్డు ఏర్పాటు
ABN , Publish Date - Aug 12 , 2026 | 02:01 AM
తిరుపతి కేంద్రంగా జిల్లా ఏర్పాటయ్యాక మొదటిసారిగా జిల్లా జువెనైల్ బోర్డు ఏర్పాటైంది. నేరాలకు పాల్పడిన బాలల సంక్షేమం, సంరక్షణ, పునరావాసం వంటి కార్యక్రమాలను ఈ బోర్డు పర్యవేక్షిస్తుంది. దీనికి హైకోర్టు నామినేట్ చేసే ప్రిన్సిపల్ మొజిస్ట్రేట్ అధ్యక్షత వహిస్తారు. సోషల్ వర్కర్ మెంబరుగా పాకాల మండలం నేలదానిపల్లెకు చెందిన గుంటూరి కేశవులు నాయుడు నియమితులయ్యారు.
సోషల్ వర్కర్ మెంబర్‌గా కేశవులు నాయుడు
తిరుపతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): తిరుపతి కేంద్రంగా జిల్లా ఏర్పాటయ్యాక మొదటిసారిగా జిల్లా జువెనైల్ బోర్డు ఏర్పాటైంది. నేరాలకు పాల్పడిన బాలల సంక్షేమం, సంరక్షణ, పునరావాసం వంటి కార్యక్రమాలను ఈ బోర్డు పర్యవేక్షిస్తుంది. దీనికి హైకోర్టు నామినేట్ చేసే ప్రిన్సిపల్ మొజిస్ట్రేట్ అధ్యక్షత వహిస్తారు. సోషల్ వర్కర్ మెంబరుగా పాకాల మండలం నేలదానిపల్లెకు చెందిన గుంటూరి కేశవులు నాయుడు నియమితులయ్యారు. బోర్డు కాలపరిమితి మూడేళ్ళు.రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.సూర్యకుమారి మంగళవారం బోర్డు ఏర్పాటు, కేశవులు నాయుడి సభ్యత్వానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.