పోలింగ్ కేంద్రాలకు తరలిన సామగ్రి
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:49 AM
చిత్తూరు నగరపాలక సంస్థకు సంబంధించి ఎన్నికల పోలింగ్ సామగ్రి శనివారం సాయంత్రానికి పూర్తయింది. స్థానిక పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ర్టిబ్యూషన్ సెంటర్ నుంచి తరలింపు ప్రక్రియ కొనసాగింది.
చిత్తూరు అర్బన్, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): చిత్తూరు నగరపాలక సంస్థకు సంబంధించి ఎన్నికల పోలింగ్ సామగ్రి శనివారం సాయంత్రానికి పూర్తయింది. స్థానిక పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ర్టిబ్యూషన్ సెంటర్ నుంచి తరలింపు ప్రక్రియ కొనసాగింది. ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన 420 మంది పీవోలు, ఏపీవోలు, 723 మంది ఓపీవోలు డిస్ర్టిబ్యూషన్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల నుంచి పోలింగ్ మెటీరియల్ స్వీకరించారు. బ్యాలెట్ పెట్టెలు, బ్యాలెట్ పేపర్లు, పోలింగ్‌కు సంబంధించిన ఇతర మెటీ రియల్‌ను పరిశీలించారు. బ్యాలెట్ పేపర్లపై సీరియల్ నెంబర్లు, అభ్యర్థి పేర్లు, గుర్తులు, తదితర్చాు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నారు. పోలింగ్ బూత్‌ల ఏర్పాటుకు ఇచ్చిన ఇతర వస్తువులను చెక్ చేసుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన నాలుగు సెట్ల ఓటరు జాబితాలు సక్రమంగా ఉందో లేదో చూసుకున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో ఆయా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు.