Share News

సోమలను వీడని ఏనుగులు

ABN , Publish Date - May 30 , 2026 | 12:45 AM

సోమల మండలంలో వారంగా సంచరిస్తున్న ఒంటరి ఏనుగు గురువారం రాత్రి ఆవులపల్లె పంచాయతీలోని రాంపల్లె బీట్‌, పట్రపల్లె, కొత్తూరు సమీపంలోని టమోటా, మామిడి తోటల్లో తిరగాడి పంటలను తొక్కివేసింది.

సోమలను వీడని ఏనుగులు

కోతకు సిద్ధంగా ఉన్న టమోటా, మామిడి ధ్వంసం

సోమల, మే 29 (ఆంధ్రజ్యోతి): సోమల మండలంలో వారంగా సంచరిస్తున్న ఒంటరి ఏనుగు గురువారం రాత్రి ఆవులపల్లె పంచాయతీలోని రాంపల్లె బీట్‌, పట్రపల్లె, కొత్తూరు సమీపంలోని టమోటా, మామిడి తోటల్లో తిరగాడి పంటలను తొక్కివేసింది. టమోటా తోటలో ఊతంగా నాటిన కర్రలను, డ్రిప్‌ పరికరాలను ధ్వంసం చేసినట్లు రైతులు తెలిపారు. పట్రపల్లె బైగానికుంట వద్ద రైతులు మునీశ్వరరెడ్డి, సిద్దయ్య, రవికుమార్‌, శ్రీరాములు పొలాల్లో ఒంటరి ఏనుగు సంచరించింది. కంచెను, రాతి కూసాలను విరిచేసింది. తోటల వద్ద రాత్రి కాపుకాస్తున్న రైతులు ఏనుగును గుర్తించి గ్రామానికి చేరుకున్నారు. ఏనుగు దాడిలో సుమారు రూ.లక్ష మేర పంట నష్టం జరిగినట్లు రైతులు వాపోతున్నారు. టమోటా, మామిడి కోతల సమయంలో తరచూ ఏనుగుల గుంపు సంచారంతో పొలాల వైపు వెళ్లేందుకు రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - May 30 , 2026 | 12:45 AM