Share News

ఏనుగుల జలకాలాట

ABN , Publish Date - Aug 14 , 2026 | 02:56 AM

బంగారుపాళ్యం మండలం మొగిలి కౌండిన్య అభయారణ్యంలో రెండు వారాల నుంచి ఏనుగుల గుంపు తిష్టవేశాయి. గురువారం సాయంత్రం మొగిలి సమీపంలోని గౌనివానిచెరువులో సుమారు 15 ఏనుగుల గుంపు జలకాలాడాయి.

ఏనుగుల జలకాలాట
గౌనివానిచెరువులో సేదతీరుతున్న ఏనుగుల గుంపు

బంగారుపాళ్యం, ఆంధ్రజ్యోతి

బంగారుపాళ్యం మండలం మొగిలి కౌండిన్య అభయారణ్యంలో రెండు వారాల నుంచి ఏనుగుల గుంపు తిష్టవేశాయి. గురువారం సాయంత్రం మొగిలి సమీపంలోని గౌనివానిచెరువులో సుమారు 15 ఏనుగుల గుంపు జలకాలాడాయి. ఒకదానిమీద ఒకటి నీళ్లు చల్లుకుంటూ సరదాగా గడిపాయి. పగలంతా దేవరకొండ దిగువన ఉన్న మునెలప్పకుంట వద్ద గల దట్టమైన నేరేడుచెట్ల కింద సేదతీరాయి. అలాగే మరో గుంపు గౌనివానిచెరువు సమీపంలోని పెద్దవంకలోని ఇసుకలో ఆడుతుంటాయని రైతులు చెబుతున్నారు. చీకటిపడగానే సమీపంలోని మామిడి తోపుల్లోకి వచ్చి తెల్లవారుజాము వరకు చెట్లను విరిచేస్తున్నాయి. మరో ఒంటరి ఏనుగు పగలే మామిడి తోపుల్లో తిరుగుతూ పంటను ధ్వంసం చేస్తోంది. గురువారం సాయంత్రం కొంత మంది రైతులు ఎత్తయిన ప్రదేశం నుంచి ఏనుగుల కదలికలను చూసి సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.

Updated Date - Aug 14 , 2026 | 02:56 AM