Share News

విద్యుదాఘాతంతో ఏనుగు మృతి

ABN , Publish Date - Oct 25 , 2026 | 01:17 AM

చిత్తూరు జిల్లా ఐరాల మండలం చుక్కావారిపల్లెలోని పొలంలో ఓ ఏనుగు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. ఈ గ్రామం అడవికి అతి సమీపంలో ఉంది. తరచూ ఏనుగులు ఈ ప్రాంతంలోని పంట పొలాలను ధ్వసం చేస్తుంటాయి. ఈక్రమంలో శనివారం తెల్లవారుజామను ఓ మగ ఏనుగు ఆహారం కోసం చుక్కావారిపల్లెలోని పొలానికి చేరుకుంది. చెన్నరాయులు కూరగాయల పంటపై దాడి చేసింది. అదే సమయంలో పంట పొలంలో తక్కువ ఎత్తులో ఉన్న 11కేవీ విద్యుత్‌ తీగలు తొండానికి తగలడంతో ఏనుగు మృతి చెందింది.

విద్యుదాఘాతంతో  ఏనుగు మృతి
మృతి చెందిన ఏనుగు

ఐరాల, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా ఐరాల మండలం చుక్కావారిపల్లెలోని పొలంలో ఓ ఏనుగు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. ఈ గ్రామం అడవికి అతి సమీపంలో ఉంది. తరచూ ఏనుగులు ఈ ప్రాంతంలోని పంట పొలాలను ధ్వసం చేస్తుంటాయి. ఈక్రమంలో శనివారం తెల్లవారుజామను ఓ మగ ఏనుగు ఆహారం కోసం చుక్కావారిపల్లెలోని పొలానికి చేరుకుంది. చెన్నరాయులు కూరగాయల పంటపై దాడి చేసింది. అదే సమయంలో పంట పొలంలో తక్కువ ఎత్తులో ఉన్న 11కేవీ విద్యుత్‌ తీగలు తొండానికి తగలడంతో ఏనుగు మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న డీఎ్‌ఫవో సుబ్బరాజు, సబ్‌ డీఎ్‌ఫవో వేణుగోపాల్‌, ఎఫ్‌ఆర్వో పట్టాభిలక సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తిరుపతి జూ అధికారులకు సమాచారమిచ్చారు. జూ డాక్టర్‌ అరుణ్‌ వచ్చి పంచనామా నిర్వహించారు. విద్యుత్‌ షాక్‌తో ఏనుగు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఏనుగు దంతాలను తొలగించి జూకు తరలించారు. అనంతరం పొలంలోనే గొయ్యి తీసి ఖననం చేశారు. విద్యుత్‌ తీగలు చేతికందే ఎత్తులో ఉన్నందునే ఏనుగుకు విద్యుత్‌ షాక్‌ గురై మృతి చెందిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఆర్వో రాకేష్‌, ఎఫ్‌బీవోలు గణేష్‌, లావణ్య తదితరులు పాలొన్నారు.

Updated Date - Oct 25 , 2026 | 01:17 AM