Share News

విద్యుత్‌ అధికారులు వర్షాలపట్ల అప్రమత్తంగా వుండాలి

ABN , Publish Date - Sep 22 , 2026 | 01:35 AM

సదరన్‌ డిస్కం పరిధిలో బలమైన గాలులు వీస్తూ, వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో విద్యుత్‌ అధికారులు, సిబ్బంది, వినియోగదారులు అప్రమత్తంగా వుండాలని సదరన్‌ డిస్కం సీఎండీ శివ శంకర్‌ ఒక ప్రకటనలో సూచించారు.విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలను నివారించడానికి అధికారులు విద్యుత్‌ సరఫరాకు అవసరమైన పరికరాలను అందుబాటులో వుంచుకోవాలని సూచించారు.

విద్యుత్‌ అధికారులు వర్షాలపట్ల అప్రమత్తంగా వుండాలి

తిరుపతి (ఆటోనగర్‌), సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సదరన్‌ డిస్కం పరిధిలో బలమైన గాలులు వీస్తూ, వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో విద్యుత్‌ అధికారులు, సిబ్బంది, వినియోగదారులు అప్రమత్తంగా వుండాలని సదరన్‌ డిస్కం సీఎండీ శివ శంకర్‌ ఒక ప్రకటనలో సూచించారు.విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలను నివారించడానికి అధికారులు విద్యుత్‌ సరఫరాకు అవసరమైన పరికరాలను అందుబాటులో వుంచుకోవాలని సూచించారు.వినియోగదారులు పెనుగాలులు వీస్త్తున్న సమయంలో విద్యుత్‌ తీగల క్రింద వుండరాద న్నారు. తీగలు తెగిన ప్రాంతాల్లో వున్న ప్రజలు ప్రమాదం జరిగిన వివరాలను సమీపంలో వున్న తమ విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తమ శాఖ టోల్‌ఫ్రీ నెంబర్లకు 1912, లేదా 1800 425155333కి సమాచారాన్ని అందించాలని ఆయన కోరారు. వాట్సాప్‌ నెంబరు 9133331912కు చాట్‌ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వ్యవసాయ కనెక్షన్ల సీనియారిటీని యాప్‌ ద్వారా తెలుసుకోండి

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల సీనియారిటీని యాప్‌ ద్వారా రైతులు తెలుసుకొనే వసతి కల్పించామని సీఎండీ శివశంకర్‌ వెల్లడించారు.తిరుపతి సదరన్‌ డిస్కం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమంలో 103 మంది వినియోగదారులు తమ సమస్యలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు కోసం తమ విద్యుత్‌ కార్యాలయాల వద్దకు తిరగకుండా ప్రత్యేక యాప్‌ను రూపొందించామన్నారు. మొదట యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని దరఖాస్తు నెంబరు నమోదు చేస్తే వివరాలు తెలుస్తాయన్నారు.వినియోగదారుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. సంస్థ డైరెక్టర్‌ కె.గురవయ్య, సీజీఎంలు ఎం.మురళీకుమార్‌, సిహెచ్‌.రామచంద్రయ్య. జె. రమణాదేవి, ఎన్‌.శోభావాలంటీనా, ఎస్‌.రమణ, కె.సంపత్‌ కుమార్‌, ఎ.శ్రీకాంత్‌, ఎ.శ్రీనివాసబాబు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 01:35 AM