Share News

ఎన్నికల నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Nov 03 , 2026 | 01:31 AM

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో పోలింగ్‌ అధికారులు కచ్చితంగా నిబంధనలను పాటించాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు. పెద్దమండ్యం, గాలివీడులో సోమవారం జరిగిన పోలింగ్‌ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఇచ్చిన శిక్షణ గురించి ఆరా తీశారు.

ఎన్నికల నిబంధనలు పాటించాలి
అధికారులతో మాట్లాడుతున్న నిశాంత్‌కుమార్‌, పక్కన సబ్‌ కలెక్టర్‌ చల్లా కల్యాణి

- పోలింగ్‌ అధికారుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌

పెద్దమండ్యం/గాలివీడు, నవంబరు 2(ఆంధ్రజ్యోతి) : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో పోలింగ్‌ అధికారులు కచ్చితంగా నిబంధనలను పాటించాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు. పెద్దమండ్యం, గాలివీడులో సోమవారం జరిగిన పోలింగ్‌ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఇచ్చిన శిక్షణ గురించి ఆరా తీశారు. పోలింగ్‌ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. పోలింగ్‌ తర్వాత సీల్‌, సంతకాలు చేయడంలో జాగ్రత్త వహించాలన్నారు. సందేహాలు ఉంటే అందుబాటులో ఉన్న అధికారులకు అడిగి తెలుసుకోవాలన్నారు. సబ్‌ కలెక్టర్‌ చల్లా కల్యాణి, రాయచోటి ఆర్డీవో శ్రీనివాసులు, రిట్నరింగ్‌ అధికారి దామోదర్‌రెడ్డి, తహసీల్దార్‌ తేజస్వి, ఎంపీడీవో శ్రీధర్‌రావు. ఎంఈవోలు మనోహర్‌, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2026 | 01:31 AM