Share News

పకడ్బందీగా వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

ABN , Publish Date - Aug 23 , 2026 | 03:04 AM

వరసిద్ధుడి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎమ్మెల్యే మురళీమోహన్‌లు అధికారులకు సూచించారు. సెప్టెంబరు 14 నుంచి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్న క్రమంలో శనివారం ఆలయ సమావేశ మందిరంలో

పకడ్బందీగా వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
: సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌,ఎమ్మెల్యే

భక్తుల సంతృప్తికర దర్శనానికి ప్రాధాన్యత

అధికారులకు కలెక్టర్‌,ఎమ్మెల్యేల సూచన

ఐరాల(కాణిపాకం), ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): వరసిద్ధుడి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎమ్మెల్యే మురళీమోహన్‌లు అధికారులకు సూచించారు. సెప్టెంబరు 14 నుంచి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్న క్రమంలో శనివారం ఆలయ సమావేశ మందిరంలో చైర్మన్‌ మణినాయుడు అధ్యక్షతన సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌,ఎమ్మెల్యేలు మాట్లాడుతూ భక్తులందరూ స్వామిని సంతృప్తిగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి 10 నిముషాలకు ఒకటి చిత్తూరు నుంచి, ప్రతి అర్ధ గంటకు ఒక బస్‌ కాణిపాకం వచ్చేలా చూడాలన్నారు. భక్తుల భద్రత కోసం వంద సీసీ కెమెరాలను అమర్చాలన్నారు. రోడ్లపై చిన్న రిపేర్లుంటే తక్షణమే సరిచేయాన్నారు. కాణిపాకంలో మొబైల్‌ మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్నారు.అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

దర్శన క్యూలైన్లలో భక్తులకు అనారోగ్య సమస్య తలెత్తితే అత్యవసర చికిత్స చేయడానికి ఆంబులెన్స్‌,వీల్‌ చైర్‌లు అందుబాటులో ఉంచాలని వారు పేర్కొన్నారు. షార్టు స ర్యూట్‌ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్‌ శా ఖను ఆదేశించారు. రాత్రి 7 నుంచి అర్ధరాత్రి 12 గంటల లోపు తిరిగి వాహనసేవలు ము గిసేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ప్రధాన ఉత్సవాల రోజు తగినంత పోలీసు బ ందోబస్తును ఏర్పాటు చేస్తాని ఎస్పీ తుషారదూడి తెలిపారు. ఆలయం వద్ద కమాండ్‌ క ంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి 24 గంటలు పోలీసులు విధులు నిర్వహిస్తారన్నారు. సమావేశంలో డీఎస్పీ వెంకటనారాయణ,సీఐ శ్రీధర్‌నాయుడు,బోర్డు సభ్యులు నాగరాజ్‌నాయుడు, వసంత,శ్రీవాణి, నరేష్‌, సతీష్‌, అనసూయ, శివప్రసాద్‌,చంద్రశేఖర్‌రెడ్డి,సుబ్బారెడ్డి, సంధ్యారాణి,డీఈవో సాగర్‌బాబు,ఏఈవోలు ఎస్వీ.కృష్ణారెడ్డి,ప్రసాద్‌,హరిమాధవరెడ్డి,రవీంద్రబాబు,సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 03:04 AM