Share News

ఏకాదశి, ద్వాదశి దర్శనాలు సక్సెస్‌

ABN , Publish Date - Jan 01 , 2026 | 01:07 AM

పదిరోజుల వైకుంఠద్వార దర్శనాల్లో తొలిరెండు రోజులైన వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాలు విజయవంతంగా పూర్తయ్యాయి. టోకెన్లు పొందిన భక్తులనే అనుమతించడంతో ఎలాంటి తోపులాటలు, తొక్కిసలాటలు లేకుండా భక్తులు శ్రీవారిని దర్శించుకుని వైకుంఠద్వార ప్రవేశం చేశారు.

ఏకాదశి, ద్వాదశి దర్శనాలు సక్సెస్‌
పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టం

తిరుమల, డిసెంబరు31(ఆంధ్రజ్యోతి): పదిరోజుల వైకుంఠద్వార దర్శనాల్లో తొలిరెండు రోజులైన వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాలు విజయవంతంగా పూర్తయ్యాయి. టోకెన్లు పొందిన భక్తులనే అనుమతించడంతో ఎలాంటి తోపులాటలు, తొక్కిసలాటలు లేకుండా భక్తులు శ్రీవారిని దర్శించుకుని వైకుంఠద్వార ప్రవేశం చేశారు. మరోవైపు జనవరి1, సర్వదర్శనాలు ప్రారంభమయ్యే 2వ తేదీల్లో రద్దీ ఎక్కువైనా పటిష్ట చర్యలు చేపట్టేలా టీటీడీ ముందస్తు ప్రణాళికతో సిద్ధమైంది. ఇక, బుధవారం వైకుంఠద్వాదశి సందర్భంగా ఉదయం చక్రస్నానాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయం నుంచి సుదర్శన చక్రత్తాళ్వారును శ్రీవారి పుష్కరిణికి వేంచేపుగా తీసుకొచ్చారు. ఈ సమయంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ చక్రత్తాళ్వార్‌ పల్లకీని కొద్దిదూరం మోశారు. అనంతరం చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2026 | 01:07 AM