Share News

ఈద్‌ ముబారక్‌హో

ABN , Publish Date - Mar 22 , 2026 | 01:05 AM

నెలరోజుల కఠోర ఉపవాస దీక్షల అనంతరం రంజాన్‌ పర్వదినం శనివారం రానే వచ్చింది. ముస్లింల మోములో ఆనందాన్ని మోసుకొచ్చింది. ఈదుల్‌ ఫితర్‌ సందర్భంగా జిల్లాలోని మసీదులు,ఈద్గాలు ఆధ్యాత్మిక శోభతో అలరారాయి.

ఈద్‌ ముబారక్‌హో
చిత్తూరు ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

నెలరోజుల కఠోర ఉపవాస దీక్షల అనంతరం రంజాన్‌ పర్వదినం శనివారం రానే వచ్చింది. ముస్లింల మోములో ఆనందాన్ని మోసుకొచ్చింది. ఈదుల్‌ ఫితర్‌ సందర్భంగా జిల్లాలోని మసీదులు,ఈద్గాలు ఆధ్యాత్మిక శోభతో అలరారాయి. మతపెద్దల సందేశాలతో మారుమోగాయి. పిల్లాపాపలతో తరలివచ్చిన ముస్లింలతో నిండిపోయాయి. అత్తరు పరిమళాలతో గుబాళించాయి. ప్రత్యేక నమాజ్‌ అనంతరం వీరంగా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అతిథులకు,ఆత్మీయులకు నోరు తీపి చేసి పండుగ సంతోషాన్ని పంచుకున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 01:05 AM