అంతరిక్ష విజ్ఞానంలో దేశాన్ని అగ్రగామిగా నిలపడానికి కృషి
ABN , Publish Date - Apr 20 , 2026 | 02:22 AM
అంతరిక్ష విజ్ఞానంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నట్లు ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ తెలియజేశారు. దేశ అంతరిక్ష రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దే లక్ష్యంతో తిరుపతి ఐఐటీ, మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ (ఎంఎ్‌ఫఎఫ్) సంయుక్తంగా ‘బిల్డింగ్ ఇండియాస్ స్పేస్ వర్క్‌ఫోర్సు’ అనే అంశంపై నిర్వహించిన రెండ్రోజుల సదస్సు ఆదివారంతో ముగిసింది.
- ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ
ఏర్పేడు, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): అంతరిక్ష విజ్ఞానంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నట్లు ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ తెలియజేశారు. దేశ అంతరిక్ష రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దే లక్ష్యంతో తిరుపతి ఐఐటీ, మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ (ఎంఎ్‌ఫఎఫ్) సంయుక్తంగా ‘బిల్డింగ్ ఇండియాస్ స్పేస్ వర్క్‌ఫోర్సు’ అనే అంశంపై నిర్వహించిన రెండ్రోజుల సదస్సు ఆదివారంతో ముగిసింది. అంతరిక్ష రంగ నిపుణులను తయారు చేయడానికి ఐఐటీ తిరుపతిలో ఒక స్పేస్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను రూపొందించడానికి ఈ సదస్సులో ప్రణాళికను సిద్ధం చేశారు. ఐఐటీ డైరెక్టర్ మాట్లాడుతూ, స్కూల్ ఆఫ్ స్పేస్ సైన్స్, టెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ అభివృద్ధి చేయడానికి, అలాగే భవిష్యత్ వ్యోమోగాములకు శిక్షణ కేంద్రంగా సేవలందించడానికి ఐఐటీ తిరుపతి భౌగోళికంగా అత్యంత అనువైన ప్రాంతంలో ఉందని చెప్పారు. అంతరిక్ష రంగంలో ఐఐటీ చొరవ అవసరమని ఎంఎ్‌ఫఎఫ్ వ్యవస్థాపకుడు రాహుల్ మెహతా అన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్రో, డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ, ఐఐఎ్‌సటీకి చెందిన ప్రముఖులతోపాటు స్కైరూట్ ఏరోస్పేస్ వంటి ప్రైవేటు అంతరిక్ష సంస్థల నాయకులు, వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, ఐఐటీ రిజిస్ర్టార్ కృష్ణకుమార్, పీఆర్వో చమన్ మెహతా తదితరులు పాల్గొన్నారు.